జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మీద విమర్శలు చేయకుండా కేవలం జగన్ మీదే విమర్శలు చేయడంతో పవన్ తెర వెనుక టీడీపీతో కుమ్మక్కయాడని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుండి చాలామంది నటులు, దర్శకులు, నిర్మాతలు ఇంకా ఇతర శాఖలకు సంబంధించి చాలామంది వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా అతని పార్టీలో చేరారు. ఆ విధంగానే జయసుధ కూడా చేరి ఆ పార్టీ తరుపున విస్తృతంగా ప్రచారం చేసారు.


దానికి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తట్టుకోలేక... సినిమా వాళ్ళకి పని ఏమిలేదు అందుకే జగన్ పార్టీలో చేరారు అని విమర్శించారు. దానికి జయసుధ చాల కోపం తెచ్చుకున్నారు. పనిలేక కాదు పార్టీ మరియు జగన్ నచ్చడంతో చేరాము అన్నారు. అయితే ఆమె చంద్రబాబుని ఘాటుగా విమర్శిస్తూనే పవన్ కళ్యాణ్ ని కూడా బాగా తప్పుపట్టారు. చంద్రబాబు చిత్ర పరిశ్రమకి సంబంధించిన వాళ్ళని అంటూ ఉంటే పవన్ కళ్యాణ్ అంత సైలెంట్ గా ఎందుకు ఉన్నాడో అర్థంకాలేదు అని అన్నారు. అతను కూడా అక్కడ నుండే కదా వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం వెనక జయసుధ ఒక కారణం చెప్పారు.

తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పవన్ కళ్యాణ్ సీక్రెట్ గా కలిసి పనిచేస్తాం అని ఒప్పదం కుదుర్చుకోవటం వల్లనే పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడటం లేదు అని చెప్పారు జయసుధ. ఇప్పుడు జగన్ పార్టీ లో చేరిన వాళ్ళందరూ కూడా చాలా బిజీ గా వుండే వాళ్ళే అని ఆమె చెప్పారు. జగన్ వ్యక్తిత్వం, అతని ఆలోచనలు, అతని ప్రజల కోసం ఏదో చెయ్యాలన్న పట్టుదల ఇవన్నీ నచ్చి అందరూ చేరుతున్నారు అని ఆమె చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: