ఈ వారం విడుదల కాబోతున్న ‘చిత్రలహరి’ మూవీ రిజల్ట్ గురించి టెన్షన్ పడుతున్న సాయి తేజ్ నిన్న ఈసినిమా విజయం కోరుకుంటూ తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ఆతరువాత అక్కడ తనకు ఎదురైన మీడియా వర్గాలతో పవన్ ‘జనసేన’ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

ఎన్నికల ప్రచారం ముగింపుకు వస్తున్న సమయంలో అల్లు అర్జున్ వరుణ్ తేజ్ లాంటి మెగా హీరోలు అంతా పవన్ కోసం ప్రచారం చేస్తుంటే ఆవిషయాలను పట్టించుకోకుండా తిరుపతిలో ఎందుకు సమయం గడుపుతున్నారు అన్న విషయమే షాకింగ్ కామెంట్స్ చేసాడు. తాను పవన్ కోసం ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవడానికి గల కారణం పవన్ ఇచ్చిన ఆదేశం అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. 

ఈమధ్య తాను పవన్ ను కలిసినప్పుడు సినిమాలు రాజకీయాలను కలుపుకుంటూ రెండు పడవల ప్రయాణం చేయవద్దని సలహా ఇచ్చిన విషయాన్ని బయటపెట్టాడు. సినిమా కెరియర్ లో సెటిల్ కాకుండా రాజకీయాలవైపు ఆలోచింప వద్దని అది ఏమాత్రం మంచిదికాదు అంటూ పవన్ సలహాలను పాటిస్తూ తాను ‘జనసేన’ ప్రచారానికి దూరంగా ఉన్న విషయాన్ని బయట పెట్టాడు. 

దీనితో తేజ్ పవన్ ఎన్నికల ప్రచారానికి ఎందుకు దూరంగా ఉన్నాడు అన్న విషయమై క్లారిటీ వచ్చింది. అయితే ఇదే రెండు పడవల సిద్దాంతం వరుణ్ తేజ్ కు అల్లు అర్జున్ కు ఎందుకు వర్తించదు అన్న విషయమై తేజ్ క్లారిటీ ఇవ్వలేకపోయినా తన విషయంలో పవన్ ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా అమలు పరిచిన వ్యక్తిగా తేజ్ మిగిలిపోయాడు. దీనితో ఒకే పడవను నమ్ముకుని ప్రయాణం చేస్తున్న సాయి తేజ్ అంచనాలు ఎంతవరకు సక్సస్ అవుతాయి అన్నది ‘చిత్రలహరి’ విడుదల తరువాత మాత్రమే తెలుస్తుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: