పెళ్లయిన తర్వాత నాగార్జున సమంత కలిసి నటించిన మజిలీ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో మంచి సంతోషంలో ఉన్నారు అక్కినేని కుటుంబం. ఇటీవల నాగార్జున కుమారుడు నాగ చైతన్య కి అదేవిధంగా అక్కినేని అఖిల్ కి సరైన హిట్లు లేని క్రమంలో తాజాగా మజిలీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం తో నాగార్జున తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Related image

అంతేకాకుండా నాగచైతన్యని మరియు తన కోడలు సమంత ని ఇంటికి పిలిపించి మరీ డిన్నర్ పార్టీ చేసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగార్జున మన్మధుడు పార్ట్ 2 సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన్మధుడు పార్ట్ 2 సినిమాలో కొడుకు నాగచైతన్య మరియు కోడలు సమంత తన సినిమాలో ఉండేటట్లు నాగార్జున నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ టాక్.

Image result for majili nagarjuna

గత కొంత కాలం నుండి సోగ్గాడు సినిమా తర్వాత సరైన హిట్ లేని నాగార్జున ఇటీవల అనేక ఫ్లాపులు చూసిన నేపథ్యంలో మన్మధుడు పార్ట్ 2 సినిమా తో ఎలాగైనా హిట్ కొట్టాలని ఈ సినిమా కోసం చాలా శ్రద్ధ వహిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే సమంత అక్కినేని గారి కుటుంబం లో అడుగుపెట్టడంతో మంచి సక్సెస్ లు వస్తున్న క్రమంలో సమంత నాగ చైతన్య ని తన మన్మధుడు రెండో భాగం సినిమా లో సెంటిమెంట్ గా నాగార్జున వాడుతున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: