తెలుగు, హిందీ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.  శివ చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన ఆయన కెరీర్ లో ఎన్నో కాంట్రవర్సీ చిత్రాలు తెరకెక్కించారు.  ఇటీవల ఆయన తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విషయంలో ఎన్నో ఇబ్బందులు తలెత్తిన విషయం తెలిసిందే.  ఈ చిత్రం ఏపిలో తప్ప తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యింది.  ఇప్పటి వరకు దర్శకుడిగా ఉన్న రాంగోపాల్ వర్మ దర్శకుడిగానే ఉన్నారు..ప్రస్తుతం ఆయన నటుడిగా మారబోతున్నట్లు ప్రకటించారు. 

కోబ్రా చిత్రంతో తాను వెండి తెరపై కనిపించబోతున్నాడు.  సాధారణంగా  ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు డ్రెస్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.  తమ అభిమాన హీరో, హీరోయిన్లు వేసే డ్రెస్సులను ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. ఇప్పుడు దర్శకులు కూడా ఫ్యాషన్ మైంటైన్ చేయడంలో మేం హీరోలకు తక్కువేమీ కాదని అంటున్నారు.  పూరి జగన్నాథ్ దన డ్రెస్సింగ్ విషయంలో ఎంతో స్టైల్ మేయింటేన్ చేస్తుంటారు.

ఇక  'కోబ్రా' సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ని హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే..ఈ వేడుకకు రామ్ గోపాల్ వర్మ రెడ్ కలర్ టీషర్ట్, బ్లూ కలర్ జీన్స్ వేసుకోచ్చారు. ఆయన జీన్ చూసిన వారు చాలా ఫన్నీగా ఉందంటూ కామెంట్స్ చేసుకున్నారు.  అయితే వర్మ వేసుకున్న జీన్స్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..అక్షరాల మూడు లక్షల రూపాయలు...దాంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఔనా..అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా రాంగోపాల్ వర్మ ఏం చేసిన సంథింగ్ స్పెషల్ అంటున్నారు ఫ్యాన్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: