తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితాన్ని ‘సైరా’ గా మారుస్తున్న నేపధ్యంలో ఈమూవీ కథ కోసం చాల పరిశోధన చేయవలసి వచ్చింది. దీనికోసం కొన్ని నెలల పాటు ఈమూవీ స్క్రిప్ట్ ను అందించిన పరుచూరి బ్రదర్స కర్నూల్ జిల్లాలో ఎంతోమంది చరిత్ర కారులను కలవడం జరిగింది. 

ఇప్పుడు ఈమూవీకి సంబంధించి కథ మరీ పెద్దది అయిపోవడంతో ఈమూవీ కథలో ప్రాధాన్యత లేని సీన్స్ ను తొలగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సీన్స్ షూట్ చేయడడం జరిగినా మూవీ నిడివి పెరిగి ప్రేక్షకులకు అసహనం కలుగుతుంది అన్న ఉద్దేశ్యంతో చిరంజీవి సలహాతో చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. 

మరొకవైపు ‘సైరా’ షూటింగ్ మరో రెండు వారాలలో పూర్తి అవుతున్న నేపధ్యంలో ఈమూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి అన్న
ఉద్దేశ్యంతో అప్పుడే చరణ్ ఈమూవీలోని అనవసరపు సన్నివేశాలు ఎంపిక చేసే పని ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ వచ్చేనేలకు వాయిదా పడిన నేపధ్యంలో చరణ్ తనకు లభించిన ఖాళీతో ‘ఆర్ ఆర్ ఆర్’ ఎడిటింగ్ పై దృష్టిపెడుతున్నట్లు సమాచారం. 

చిరంజీవి తన జపాన్ ట్రిప్ నుండి తిరిగి వచ్చిన నేపధ్యంలో ఈమూవీకి సంబంధించి చైనాలో జరగకపోయే కీలక షెడ్యూల్ కు రేపు జరగబోయే ఎన్నికల తరువాత వెళ్ళబోతున్నట్లు టాక్. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఎట్టి పరిస్తుతులలోను ఈమూవీని అక్టోబర్ లో వచ్చే దసరాకు విడుదల చేసి తీరాలని చరణ్ చాల గట్టి పట్టుదల పై ఉన్నట్లు తెలుస్తోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: