‘మహర్షి’ టీజర్ కు రికార్డు వ్యూస్ వచ్చినప్పటికీ మహేష్ లో అంతర్మధనం పెరిగిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికికారణం ఈమూవీ టీజర్ పై వచ్చిన నెగిటివ్ కామెంట్స్. ఉగాది పండుగరోజున విడుదల అయిన ఈ మూవీ టీజర్ లో మైక్ ముందు మహేష్ మాట్లాడే సీన్ ఉంది. అచ్చం ఆసీన్ ‘భరత్ అనే నేను’ సినిమాలో సీన్ కు కాపీ లా ఉంది అన్న కామెంట్స్ వచ్చాయి.  

దీనికితోడు ఈ మూవీలోని ఫైట్ సన్నివేశం అచ్చం శ్రీమంతుడులో మామిడి తోట  ఫైట్ లా ఉంది అని కూడ కామెంట్స్ వచ్చాయి. అదే కాకుండా ‘మహర్షి’ టీజర్ లో మరో 2-3 సన్నివేశాలు పాత సినిమాల్ని గుర్తుకు చేసాలా ఉన్నాయి అన్న కామెంట్స్ కూడ వచ్చాయి. దీనితో ‘మహర్షి’ మూవీ పాత సినిమాల కథల సమ్మేళనంగా మారుతుందా అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. 

ఈ ఫీడ్ బ్యాక్ ‘మహర్షి’ యూనిట్ తో పాటు మహేష్ కు కూడ చేరడంతో ఇప్పడు వారంతా ఈవిషయమై తీవ్రచర్చలలో ఉన్నట్లు సమాచారం. దీనితో ‘మహర్షి’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నాడు విడుదల చేయబోయే ట్రయిలర్ పై పూర్తి కసరత్తు  ప్రారంభించినట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు మహర్షి మూవీ థీమ్ ఏమిటో చెప్పేలా ట్రయిలర్ కట్ చేయాలని మహేష్ దర్శకుడు వంశీ  పైడి పల్లికి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈసినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో ఆఅంచనాలు మరింత పెంచే విధంగా కాకుండా కొంత క్రియేటివ్ గా ఫ్రెష్ లుక్ తో ఈట్రైలర్ ను రుపొందించమని మహేష్ కోరినట్లు సమాచారం. ఈ ఏడాది సమ్మర్ రేస్ కు టాప్ హీరోల సినిమాలు ఏమిలేని నేపధ్యంలో ఈమంచి అవకాశం ‘మహర్షి’ సద్వినియోగం చేసుకోలేక పోతే అది ఒక భారీ తప్పిదం అవుతుంది అన్న అంతర్మదంలో ప్రస్తుతం మహేష్ ఉన్నట్లు సమాచారం..


మరింత సమాచారం తెలుసుకోండి: