టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్లు బన్నీ వేటలో పడ్డారు, ఎవరి వేటకు బన్నీ చిక్కుతాడు అన్నది టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట. అల్లు అర్జున్ ప్రస్తుతం రేసుగుర్రం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆతరవాత ఆయనను పట్టుకునేందుకు పలువురు డైరెక్టర్లు క్యూలో నిలుచున్నారు.

మలినేని గోపిచంద్, సుధీర్ వర్మ, వీరభద్రయ్య చౌదరి, హరీష్ శంకర్, మారుతి వంటి హేమాహేమీలు బన్నీతో సినిమా తీయాలని ఉవ్వీళూరుతున్నారట. అయితే మలినేని గోపిచంద్ వైపే అల్లు అర్జున్ మొగ్గు చూపుతున్నాడు అంటున్నారు. మరో వైపు కోన వెంకట్ మాత్ర అల్లు అర్జున్ ఇమేజికి తగ్గట్టుగా కథ, మాటలు తయారు చేస్తున్నాని ట్విట్టర్ ద్వారా చెప్పేసాడు. ఈ డైరెక్టర్లు కూడా బన్నీకి తగ్గ కథల వేటలో ఉన్నారట. ఇంతకి స్టైలిష్ స్టార్ ఎవరికి చిక్కుతాడో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: