ది బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ హిందిలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. కండలవీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా 12 సీజన్లుగా బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తూనే ఉన్నాడు. అయితే తెలుగులో మాత్రం బిగ్ బాస్ సీజన్ 1 ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తే సీజన్ 2కి నాని హోస్ట్ గా చేయాల్సి వచ్చింది.


ఎన్.టి.ఆర్ నుండి నానికి వచ్చాక బిగ్ బాస్ క్రేజ్ తగ్గింది. అయితే సీజన్ 2లో కౌశల్ ఆర్మీ చేసిన హడావిడి వల్ల షో సక్సెస్ అయ్యింది. ఇదిలాఉంటే ఇప్పుడు బిగ్ బాస్ 3కి సమయం ఆసన్నమైంది. బిగ్ బాస్ 3కి ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తాడని వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తల్లో ఏమంత వాస్తవం లేదని తెలుస్తుంది.


ఇక ఇప్పుడు బిగ్ బాస్ 3 తెలుగు హోస్ట్ ఎవరన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. నాగార్జున, వెంకటేష్ ల పేర్లు వినిపించినా ఫైనల్ గా యువ్ హీరో విజయ్ దేవరకొండ దగ్గరకు ఛాన్స్ వచ్చి ఆగిందట. అయితే రౌడీ హీరోగా విజయ్ కు యూత్ లో భారీ ఫీలోయింగ్ ఉన్న మాట వాస్తవమే కాని హోస్ట్ గా షోని నిలబెట్టే సత్తా ఇంకా రాలేదని చెప్పాలి.


అందుకే వెంకటేష్ తోనే బిగ్ బాస్ హోస్ట్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. నాగ్, చిరంజీవిలు ఆల్రెడీ బుల్లితెర మీద తమ లక్ టెస్ట్ చేసుకున్నారు. కాని వెంకీ మాత్రం హోస్ట్ గా తాను చేయలేనని అంటున్నాడట. మరి ఈసారి బిగ్ బాస్ హోస్ట్ ఎవరు అన్నద్ దాని మీద భారీ డిస్కషన్స్ జరుగుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: