టాలీవుడ్ లో కింగ్ నాగార్జునకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  ఇప్పటికీ ఆయన నవ మన్మధుడిలా కనిపిస్తుంటారు. తన తనయులు హీరోగా వస్తున్నా కూడా యంగ్ హీరోలా వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. 2016 లో సంక్రాంతి కానుకగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా సీక్వెల్ చేస్తున్న విషయం తెలి సిాందే.  ఈ సినిమాలో బంగార్రాజు క్యారెక్టర్ కి మంచి క్రేజ్ వచ్చింది..దాంతో ఇదే టైటిల్ తో సినిమా తీస్తున్నారు.


ఇదే సమయంలో రాహూల్ రవీంద్ర డైరెక్షన్ లో ‘మన్మథుడు2’ సినిమాలో నటిస్తున్నారు నాగార్జున.  రెండు సినిమాలో కొద్ది వ్యవధితో ప్రారంభం కాబోతున్నాయి.  అయితే బంగార్రాజు సినిమాలో ఆ మద్య దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతారను సంప్రదించారట.  అప్పట్లో ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. 


తాజాగా అందుతున్న సమాచారం మేరకు  డేట్స్ లేని కారణంగా ఈ సినిమా తాను చేయలేనని నయనతార చెప్పినట్టుగా ఫిలిమ్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం నయనతార తెలుగులో చిరంజీవి సరసన 'సైరా' చేస్తోంది. అలాగే తమిళంలోను మరో సినిమా చేస్తోంది. మరోవైపు రజనీ సరసన 'దర్బార్'కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఈ కారణంతోనే తనకు డేట్స్ కుదరడం లేదని తెలుస్తోంది. దాంతో కొత్త హీరోయిన్ ని వెతుక్కునే పనిలో ఉన్నారు బంగార్రాజు టీమ్. 


మరింత సమాచారం తెలుసుకోండి: