ఇండస్ట్రీలో అందరివాడుగా ఇప్పటి వరకు కొనసాగిన అలీ ఈ ఎన్నికల పుణ్యమా అని పవన్ పై చేసిన వివాదాస్పద కామెంట్స్ తో పవన్ అభిమానులకు మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీకి కూడ అసహనంగా మారాడు. ఇలాంటి పరిస్థుతులలో రేణు దేశాయ్ ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం కాబోతున్న ఒక టాక్ షోలో ఈవిషయమై అలీని అడిగినట్లు తెలుస్తోంది.

‘అలీతో సరదాగా’ కార్యక్రమంలో వచ్చే సోమవారం రేణు దేశాయ్ తో చేసిన ఇంటర్వ్యూ ప్రసారం కాబోతోంది. ఈ షోకు సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే ఈటివిలో ప్రసారం అవుతున్నాయి. అలీ ఇలాంటి షోలకు వచ్చే సెలెబ్రెటీలను వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల పై లోతుగా ప్రశ్నించే నేపధ్యంలో పవన్ రేణుల డైవర్స్ విషయమై కూడ ఈ షోలో ప్రశ్నిస్తాడా అన్న ఆసక్తి పెరిగిపోతోంది. 

దీనికితోడు ఈమధ్య అలీ పవన్ ల మధ్య మాటల యుద్ధం జరిగిన నేపధ్యంలో ఈవిషయమై రేణు ‘మీకు కళ్యాణ్ గారితో చాల పెద్ద గొడవే అయిందని విన్నాను. నిజంగా అయిందా’ అని రేణు ప్రశ్నించినప్పుడు అలీ ‘అవును’ అంటూ ఆ ఇంటర్వ్యూ ప్రోమో కట్ అవ్వడంతో ఈ ఎన్నికలలో జరిగిన అలీ పవన్ ల మాటల వార్ గురించి రేణు దేశాయ్ అడిగిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

ఇదే ఇంటర్వ్యూలో రేణు తన చిన్నతనంలో తాను పడ్డ కష్టాల గురించి ముఖ్యంగా తాను ఆడపిల్ల అని తెలిసి హాస్పటల్ కు వచ్చి తనను పసితనంలో చూడని తన తండ్రి మూర్ఖత్వం గురించి వివరంగా వివరించింది. అంతేకాదు తాను పెళ్ళి తరువాత జీవితంలో పడ్డ కష్టాలు తన పిల్లలు అకిరా ఆద్యలు లేకుంటే తాను ఏనాడో చనిపోయి ఉండేదానిని అంటూ ఉద్వేగంతో రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ ను ఈ ప్రోమోలో హైలెట్ గా చూపెడుతున్నారు. దీనితో వచ్చేవారం ప్రసారం కాబోయే ఈషో చూడడానికి పవన్ అభిమానులు మాత్రమే కాకుండా అందరు చాల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: