అల్లు అర్జున్ మూవీ ప్రాజెక్ట్ తో మహేష్ బిజీగా ఉంటే బన్నీ మూవీ ప్రాజెక్ట్ తో త్రివిక్రమ్ టెన్షన్ పడుతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మధ్య ఇప్పుడు అనుకోకుండా మహేష్ వచ్చి చేరడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఒక ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ యాడ్ కు సంబంధించిన షూటింగ్ మహేష్ త్రివిక్రమ్ లను కలిపినట్లు సమాచారం. నిన్నటి నుంచి ఈ యాడ్ షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. గతంలో కూడ మహేష్ నటించిన ‘అభీ  బస్’ యాడ్ కు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. 

అతితక్కువ మాటలతో ఎక్కువ అర్ధం వచ్చేలా సీన్స్ తీయడంతో దిట్ట అయిన త్రివిక్రమ్ యాడ్ మేకింగ్ బాగుంటుది అని ఆ ప్రముఖ మల్టీ నేషనల్ సంస్థ తన యాడ్ కోసం పట్టుపట్టి త్రివిక్రమ్ చేత మహేష్ తో ఈ యాడ్ చేయిస్తున్నట్లు టాక్. మహేష్ త్రివిక్రమ్ లతో సినిమా మళ్ళీ వస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. 

అయితే రకరకాల కారణాలతో వీరిద్దరి మూవీ ప్రాజెక్ట్ కుదరడం లేదు. ఇలాంటి పరిస్థుతులలో ఈ యాడ్ షూటింగ్ కోసం మహేష్ త్రివిక్రమ్ లు మూడురోజులు కలిసి పనిచేస్తారు కాబట్టి ఈ టైమ్ లో ఈ మాటల మాంత్రికుడు తన ఊహలో ఉన్న కథతో మహేష్ ను ఒప్పించి వచ్చే ఏడాది బెర్త్ కు ఇప్పుడే రిజర్వేషన్ చేయించుకుంటాడెమో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: