ఈ మద్య కొంత మంది హీరోయిన్లు చేస్తున్న పనుల వల్ల వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు నిరాశకు లోనవుతున్నారు..అసహనం వ్యక్తం చేస్తున్నారు.  తాజాగా దక్షిణాదిన మంచి పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ పై ఇప్పుడు తమిళ తంబీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'పీఎం మోదీ' చిత్రానికి మద్దతుగా ఆమె చేసిన ట్వీట్ చేసింది..అంతే ఆ క్షణం నుంచి ఆమెపై  తీవ్రస్థాయిలో ట్రోలింగ్ నడుస్తోంది. 


ఇంతకీ కాజల్ ట్విట్టర్ లో ఏమన్నదంటే..'పీఎం మోదీ'  మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా..ఎప్పుడు చూడాలా... ఈ సినిమా సూపర్ హిట్టవుతుంది అంటూ పేర్కొంది. దీనికి జవాబు గా మోదీ పాత్రదారుడైన వివేక్ ఒబేరాయ్  కూడా స్పందిస్తూ కాజల్ కు థ్యాంక్స్ చెప్పాడు. ఇదంతా గమనించిన తమిళ నెటిజన్లు వెంటనే రంగంలోకి దిగి కాజల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు మొదలుపెట్టారు. కొంత కాలంగా తమిళ నాట బీజేపీపై వ్యతిరేకత నెలకొంది.  రైతుల కష్టాలు అస్సలు పట్టించుకోవడం లేదని అక్కడ ప్రజలు ఎన్డీఏ పై ఆగ్రహంగా ఉన్నారు.


ఇంతలోనే కాజల్ ఇలా ట్విట్స్ పెట్టడంతో తీవ్రస్థాయిలో విమర్శలు మొదలుపెట్టారు. ప్రజలే కాదు, రాజకీయ పార్టీల నేతలు కూడా కాజల్ ట్వీట్ పై మండిపడుతున్నారు. కాజల్ సినిమాలు ఎవరూ చూడొద్దని, ఆమె నటించిన చిత్రాలపై తమిళనాడులో నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల సీజన్ నడుస్తున్న సందర్బంలో బీజేపీకి ఆమె సపోర్ట్ చేస్తుందా.. ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: