రాబోతున్న ఎన్నికల తరువాత నిశ్శబ్ద విప్లవం రాబోతోంది అంటూ పవన్ కళ్యాణ్ చాలాసార్లు ఉద్వేగంగా ఉపనాస్యాలు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి  ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన ఓటర్లు ఆంధ్రప్రాంతంలో యువకుల రైతులు ఉద్యోగులు మహిళలు అంతా తన పక్కనే ఉన్నారు అంటూ పవన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. 

పాతికేళ్ల భవిష్యత్ మనది అంటూ నినాదంతో జనం మధ్యకు వచ్చిన పవన్ ‘జనసేన’ కార్యకర్తల హడావిడి ఎన్నికలు ప్రారభం అయి సుమారు మూడు గంటలు అవుతున్నా ఇంకా ఎక్కడ పెద్దగా కనిపించక పోవడం పవన్ వీరభిమానులలను కూడ ఆశ్చర్య పరుస్తున్నట్లు సమాచారం. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఎన్నికలు జరుగుతున్న ప్రతి బూత్  సమీపంలో  తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ సానుభూతి పరుల హడావిడి కనిపిస్తోంది కానీ జనసైనికుల హడావిడి కనిపించడంలేదు అని వార్తలు వస్తున్నాయి.    

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీచేసిన నియోజక వర్గాలతో సహా నాగబాబు ఇతర ముఖ్య జనసేన  నాయకులు పోటీ చేస్తున్న చోట్ల కూడ ఇలాంటి పరిస్థితి కనిపించకపోవడం షాకింగ్ న్యూస్ గా మారింది. దీనితో పవన్ కోరుకున్న నిశ్శబ్ధ విప్లవం ఇదేనా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

ఇది ఇలా ఉండగా ఈరోజు కొద్ది సేపటి క్రితం పవన్ మీడియా వర్గాలతో మాట్లాడుతూ తాను ఈ ఎన్నికలలో ఎలాంటి ఫలితాలు వచ్చినా తాను రాజకీయాలలో కొనసాగడం తధ్యం అంటూ సంకేతాలు ఇవ్వడం బట్టి ఎన్నికలలో ‘జనసేన’ ఎదురీత అప్పుడే మొదలు అయినట్లు పవన్ కు సంకేతాలు వచ్చాయా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: