టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇడియట్ సినిమాతో హీరోగా మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు రవితేజ.  అంతకు ముందు వెండితెరపై చిన్నా చితకా పాత్రలు వేసిన రవితేజకు ‘ఇడియట్’సినిమా మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చింది.  చలాకీ తనం..మాస్ ఫాలోయింగ్..మంచి నటన వీటితో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు రవితేజ.  ఒకప్పుడు రవితేజతో సినిమాలు తీయడానికి దర్శక, నిర్మాతలు క్యూ కట్టేవారు.  కానీ గత కొంత కాలంగా రవితేజకు అన్ని ఫ్లాపులే ఎదురువుతున్నాయి. 


పవర్ సినిమా తర్వాత బెంగాల్ టైగర్, కిక్ 2 తో దారుణమైన డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకొని అనీల్ రావుపుడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్ ’సినిమాతో తన మాస్ పవర్ ఏంటో చూపించాడు.  దాంతో ఇక రవితేజకు అంతా కలిసి వస్తుందని భావించారు..కానీ వరుసగా మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.  దాంతో తన రెమ్యూనరేషన్ విషయంలో కాంప్రమైజ్ అయ్యారు రవితేజ.  ఆ మద్య   తమిళ మూవీ 'తెరి' రీమేక్ లో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.


తమిళంలో విజయ్ కథానాయకుడిగా 2016లో వచ్చిన 'తెరి' అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఈ సినిమాను పవన్ కల్యాణ్ హీరోగా రీమేక్ చేయాలని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ భావించాడు. కానీ పవన్ అప్పటికే రాజకీయాల్లో బిజీగా మారడంతో  ఈ కథ రవితేజకు వినిపించడం ఒకే అనుకోవడం జరిగింది.  ఈ నెల 15వ తేదీ నుంచి ఈ సినిమా పట్టాలెక్కుతుందని అన్నారు. కానీ కథలో చేసిన మార్పులు సంతృప్తికరంగా లేవని చెప్పిన మైత్రీ మూవీ మేకర్స్ వారు, చివరికి ఈ ప్రాజెక్టు వర్కౌట్ కాదు అని భావించి ఆపేసినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: