స్టార్ సినిమా అయినా చిన్న సినిమా అయినా డిజిటల్ రైట్స్ అందుకున్న అమేజాన్ సంస్థ సినిమా థియేటర్లో ఉన్నా కూడా అమేజాన్ లో పెట్టేస్తుంది. ఈ క్రమంలో స్టార్ సినిమాకు థియేటర్ వసూళ్లు గండి పడుతున్నాయి. అంతేకాదు డిస్ట్రిబ్యూటర్స్ కు ఇది శాపంగా మారింది. అమేజాన్ ప్రైమ్ ఇప్పటివరకు సినిమా రిలీజైన 3 వారాల్లో ఆన్ లైన్ స్ట్రీమింగ్ ఇస్తుంది.


అయితే ఇక ఇప్పుడు ఆ గడువు పెంచినట్టు తెలుస్తుంది. 3 వారాలన్నది కాస్త 8 వారాలకు పొడిగించారని తెలుస్తుంది. అమేజాన్ న్యూ అగ్రిమెంట్ ఏప్రిల్ 1 నుండి అమలు కానుందట. అయితే రీసెంట్ గా వచ్చి సూపర్ హిట్ అందుకున్న మజిలీ హిట్ టాక్ వచ్చింది నెల రోజుల్లో అమేజాన్ లో వస్తుంది అనుకుంటే పొరపడినట్టే.


అమేజాన్ న్యూ అగ్రిమెంట్ మజిలీకి బాగా కలిసి వచ్చేలా ఉంది. ఇక మజిలీ సినిమా విషయానికొస్తే నాగ చైతన్య, సమంత కలిసి నటించిన ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేశారు. దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమా చైతు కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా వసూళ్లు సాధించేలా ఉంది.


కొన్నాళ్లుగా కెరియర్ లో హిట్ కోసం సతమతమవుతున్న చైతు ఫైనల్ గా సమంత సహాయంతో హిట్టు కొట్టాడు. నిన్నుకోరి తర్వాత శివ నిర్వాణ చేసిన మజిలీ సినిమా కూడా విజయం అందుకుంది. ఇప్పటికే బయ్యర్స్ ను లాభాల బాట పట్టిన మజిలీ వసూళ్లు 30 కోట్లు దాటేలా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: