బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ కు అంతరాయం కలిగింది. రాం చరణ్ కు గాయాలవడం దానికి ఒక కారణం కాగా మరోటి ఏపిలో ఓట్లు జరగడం మరో కారణం. ఏపి తెలంగాణాలో జరుగుతున్న ఓట్లకు తన చిత్రయూనిట్ పాల్గొన్నారని చెప్పాడు రాజమౌళి అంతేకాదు యూనిట్ సగానికి పెగా ఖాళీ అయ్యిందని అన్నాడు.


కరెక్ట్ పార్టీ, లీడర్ కాకుంటే మీరు నోటా నొక్కండి అంటూ చెబుతున్నాడు రాజమౌళి. ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి హక్కు అని.. ఇది మంచి పరిణామమని అన్నారు రాజమౌళి. ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమా విషయానికొస్తే ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.


పూణెలో షూటింగ్ 3 వారాలు బ్రేక్ ఇవ్వగా ఆఫ్టర్ ఎలక్షన్స్ మళ్లీ షూటింగ్ షురూ చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అలియా భట్ ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అవగా సెకండ్ హీరోయిన్ గా చేయాల్సిన డైసీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుండి బయటకు వెళ్లారు. ఆమె ప్లేస్ లో నిత్యా మీనన్ ను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.


డివివి దానయ్య నిర్మిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తుంది. బాహుబలి లానే ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పాడు రాజమౌళి. అల్లూరిగా రాం చరణ్, కొమరం భీం గా ఎన్.టి.ఆర్ కనిపించనున్నారు. 2020 జూలై 31న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: