సినీ నటుడు కం రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఆయన నీతులు బాగానే చెబుతారు. చేతలే వేరేగా ఉంటాయి అని సెటైర్లు పడుతున్నాయి. ఇంతకీ పవన్ అలా ఎందుకు చేశాడు. ఏమా కధా


పవన్ విజయవాడ పటమట పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కుని ఈ రోజు వినియోఇగించుకున్నారు. అంతవరకూ పవన్ ఒకే. కానీ ఆయన వచ్చింది మంచి ఎండ టైంలో, అదీ జనాలు బాగా క్యూలో ఉన్న టైంలో. వచ్చిన మనిషి క్యూలో ఉండకుండా కనీసం ఎవరైనీ రిక్వెస్ట్ చేయకుండా ఎకా ఎకీన పోలింగ్ బూతులోకి చొచ్చుకుపోయాడు. దాంతో అక్కడ ఉన్న వారు ఒక్కసరిగా షాక్ అయ్యారు.పవన్ వచ్చినదే లేట్. పైగా ఆయన వెంట ఉన్నవారు హడావుడి చేయడం, పవన్ తో పాటు వారు కూడా పోలింగ్ బూతులోకి చొరబడిపోవడం, అప్పటికే ఎండలో ఉన్న వారిని సైతం పక్కకు తోసేయడం, మహిళలు, వ్రుద్ధులు అన్న తేడా లేకుండా పక్కకు నెట్టేయడంతో పవన్ వైఖరిని చూసి అక్కడ వారు ఇందేంటి ఇలా అనుకున్నారట. మండిపడ్డారట.


తాను అతి సామాన్యుడినని నీతులు చెప్పే పవన్ ఏ హోదాలో అందరి కంటే ముందు పోలింగ్ బూత్ కి వెళ్తారని జనం ప్రశ్నిస్తున్నారు క్యూ లైన్ పాటించి వెళ్ళలేరా అని నిగ్గదీస్తున్నారు.. వెంట సొంత బలగాని తెచ్చుకుని జనాన్ని నెట్టడమేంటని కూడా నిలదీస్తున్నారు. మరి పవన్ రీల్ లైఫ్, రియల్ లైఫ్ మధ్య తేడా అలా చూపించారన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: