నందమూరి ఫ్యామిలీ హీరోలు అంటే వెంటనే గుర్తుకు వచ్చేది..నందమూరి బాలకృష్ణ,హరికృష్ణ, ఎన్టీఆర్, కళ్యాన్ రామ్.  అయితే బాలకృష్ణ, హరికృష్ణ హీరోలుగా వచ్చినా..తర్వాత హరికృష్ణ రాజకీయాల్లోకి వెళ్లారు. నందమూరి హీరోగా బాలకృష్ణ 100కు పైగా సినిమాల్లో నటించారు.  ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా, రాజకీయ నాయకుడిగా తన పాత్ర పోషిస్తున్నారు.  ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. అయితే బాలకృష్ణ సహ నటులు చిరంజీవి, నాగార్జున లాంటి వారి తనయులు హీరోగా రాణిస్తున్నారు. 


అయితే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.  కానీ ఇప్పట్లో మోక్షజ్ఞ ఎంట్రీ కష్టమే అనిపించేలా ఇప్పుడు ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  గత కొంత కాలంగా బాలయ్య తనయుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వచ్చాయి. 2018లో మోక్షజ్ఞ ఎంట్రీ పక్కా అన్నారు.. ఆ తరువాత విదేశాల్లో యాక్టింగ్ శిక్షణ తీసుకుంటున్నాడని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే బాలయ్య మాత్రం మోక్షజ్ఞని పబ్లిక్ లోకి తీసుకురాకుండా జాగ్రత్త పడుతున్నాడు.


తాజాగా మోక్షజ్ఞ గెటప్ చూసిన నందమూరి  అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఒక హీరోగా ఉండాల్సిన లక్షణాలు ఏవీ మోజ్ఞనకు కనిపించడం లేదని..మాములుగా వ్యక్తిగా ఉన్నాడే తప్ప.. హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు ఏమాత్రం తెగ బాధపడిపోతున్నారు. అయితే  మోక్షజ్ఞ వయసు వారందరూ హీరోలుగా రాణిస్తున్నారు. మరి మోక్షజ్ఞ ఇప్పట్లో హీరోగా కనిపిస్తాడా..? లేదా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: