‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు సంబంధించి ఊహించని సమస్యల మధ్య సతమత మవుతున్న రాజమౌళి ఆలోచనల పై జూనియర్ అభిమానులు తీవ్ర ఆగ్రహంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ సంబంధించి జూనియర్ పక్కన నటించవలసిన బ్రిటీష్ బ్యూటీ డైసి ఈమూవీ ప్రాజక్ట్ నుండి తప్పుకోవడంతో మరో హీరోయిన్ ఎంపిక విషయంలో రాజమౌళి ఆలోచనలు కొనసాగుతున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో రాజమౌళి ఆలోచనలు జాన్వీ కపూర్ పరిణితి చోప్రా శ్రద్దా కపూర్ లపై ఉన్నట్లు సమాచారం. అయితే వీరి ముగ్గురితో పాటుగా రాజమౌళి దృష్టి నిత్యామీనన్ పై పడటమే కాకుండా ఆమెను పిలిపించి మేకప్ టెస్ట్ చేసాడు అని వస్తున్న వార్తలు వైరల్ గా మారి జూనియర్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు టాక్. 

జూనియర్ నిత్యామీనన్ ల కాంబినేషన్ ఏమాత్రం బాగుండదని గతంలో వచ్చిన ‘జనతాగ్యారేజ్’ రుజువు చేసిందని ఈవిషయం రాజమౌళి దృష్టికి రాలేదా అంటూ జూనియర్ అభిమానులు రాజమౌళికి ప్రశ్నలు వేస్తున్నారు. అంతేకాదు అలాంటి సాహసం చేయవద్దు అంటూ జూనియర్ అభిమానులు వేల సంఖ్యలో రాజమౌళికి మెసేజ్ లు పెడుతున్నట్లు టాక్. 

ఊహించని ఈ నెగిటివ్ స్పందనకు రాజమౌళి కూడ షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ లో జూనియర్ పక్కన నటించే హీరోయిన్ పాత్ర అత్యంత కీలకం అవ్వడంతో పాటు ఆపాత్ర బ్రిటీష్ లేడీ పాత్ర అవ్వడంతో లుక్ పరంగానే కాకుండా నటన విషయంలో కూడ చాల రాయల్ లుక్ తో కనిపించే హీరోయిన్ కోసం రాజమౌళి అన్వేషణలో ఉన్నట్లు సమాచారం..   



మరింత సమాచారం తెలుసుకోండి: