నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ. క్రికెటర్ అవ్వాలనుకున్న అర్జున్ అనివార్య కారణాల వల్ల కెరియర్ ఆగిపోతుంది. వేరే ఏమి చేయలేని పరిస్థితుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా తనని అర్ధం చేసుకోలేకపోతే ఆ టైంలో మళ్లీ క్రికెటర్ గా ఎలా మారాడు అన్నది జెర్సీ కథ.


ఈ సినిమా కథ చెప్పడానికి చాలా సింపుల్ గా అనిపిస్తున్నా కథలో ఉన్న పెయిన్ జెర్సీ ట్రైలర్ లో కనిపిస్తుంది. ఇక నాని అయితే సినిమాలో నటించలేదు జీవించాడని తెలుస్తుంది. నాని జెర్సీ ఇది కేవలం ఓ అర్జున్ కథ మాత్రమే కాదు కుటుంబ బాధ్యతల్లో పడి తాము కన్న కలలను కలలుగానే ఉంచుకున్న ప్రతి వ్యక్తి కథ.


ఇక సినిమా ట్రైలర్ లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పీక్స్ లో ఉండగా డైలాగ్స్ అయితే అదరగొట్టాయి. ట్రైలర్ చివరలో వచ్చిన ఇంతపెద్ద ప్రపంచంలో ఇప్పటివరకు జడ్జ్ చేయనిది నా కొడుకు ఒక్కడే.. వాడి విషయంలో నేను కొంచం తగ్గినా తట్టుకోలేను.. అనే డైలాగ్ మాత్రం ఎక్కడో టచ్ అవుతుంది.


ఏప్రిల్ 19న రిలీజ్ అవుతున్న నాని జెర్సీ సినిమా మరోసారి నాని సత్తా చాటేలా ఉంటుందని తెలుస్తుంది. మళ్లీరావా సినిమాతో సత్తా చాటిన గౌతం తిన్ననూరి జెర్సీతో మరో క్రేజీ హిట్ కొట్టేలా ఉన్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: