‘సైరా’ మూవీ షూటింగ్ ను ఎట్టి పరిస్తుతులలోను మే నెలాఖరి లోపు పూర్తి చేయాలి అని చరణ్ కండిషన్ పెడుతున్నా సురేంద్ర రెడ్డి ఆ టార్గెట్ కు అందుకునే పరిస్థుతులు లేవు అని అంటున్నారు. దీనికి కారణం ఈమూవీకి సంబంధించిన 20 రోజుల కీలక షెడ్యూల్ ఇంకా చైనాలో పూర్తి కావలసి ఉంది. 

దీనికితోడు ఈమూవీకి సంబంధించిన కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ తో పాటు ఇంకా రెండు పాటలు చిత్రీకరించ వలసి ఉంది అని అంటున్నారు. దీనితో చరణ్ ఎంత ఒత్తిడి చేసినా ఈమూవీ వర్క్ మే నెలకి పూర్తి కాదనీ జూన్ నెలాఖరుకు మాత్రమే పూర్తి అవుతుందని సమాచారం. 

ఈపరిస్తుతులలో కొరటాల చిరంజీవి కోసం మరో మూడు నెలలు వేచి చూడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అని అంటున్నారు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే కొరటాల చిరంజీవిల మూవీ జూలై నెలలో మాత్రమే ప్రారంభం అవుతుంది అని టాక్. 

దీనితో జరుగుతున్న పరిణామాలు కొరటాలకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవేకి సంబంధించిన స్క్ర్పిట్ వర్క్ పూర్తి అయి నాలుగు నెలలు కావస్తున్నా తాను చిరంజీవితో సినిమాను మొదలు పెట్టలేని స్థితిలో కొరటాల ఉండటమే కాకుండా ‘భరత్ అనే నేను’ విడుదలై సంవత్సరం అవుతున్నా ఇన్నిరోజులు ఖాళీగా ఉండటం కొరటాలకు టార్చర్ గా మారింది అన్న మాటలు వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: