టాలీవుడ్ లోకి కొరియోగ్రాఫర్ గా తన ప్రస్థానం మొదలు పెట్టిన ప్రభుదేవ ‘ప్రేమికుడు’ సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన ప్రభుదేవ తర్వాత దర్శకుడిగా మారారు.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రభుదేవ ఇప్పుడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో దబంగ్ 3 సినిమా తీస్తున్నారు. 


హ్యాపీడేస్ తో తెలుగు తెరకు పరిచయం అయిన మిల్కీ బ్యూటీ తమన్నా..హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్ లో కూడా మురిపిస్తుంది.  రాజమౌళి తీసిన బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించింది తమన్నా.  ఆ మద్య ప్రభుదేవ, తమన్నా జంటగా నటించిన ‘అభినేత్రి’ సినిమాలో తెలుగు, హిందీ భాషల్లో మంచి విజయం అందుకుంది.  తాజాగా ఈ సినిమా సీక్వెల్ రూపొందుతుంది.  


ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రధాన పాత్రధారులైన ప్రభుదేవా, తమన్నా, నందితా శ్వేతలపై ఆవిష్కరించిన ఫస్టులుక్ ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. కొంత కాలంగా తెలుగు, తమిళ భాషల్లో హర్రర్, కామెడీ నేపథ్యంలో పలు సినిమాలు మంచి విజయాన్ని అందుకుంటున్న విషయం తెలిసిందే. 


ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హర్రర్ చూపిస్తూనే ప్రభుదేవా తనదైన కామెడీ మార్క్ చాటుకోబోతున్నారని సమాచారం. 'అభినేత్రి 2' మాత్రం ప్రభుదేవా డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నట్టు చెబుతున్నారు. ఇక నందితా శ్వేత పాత్ర ప్రధాన ఆకర్షణ అవుతుందనే చెప్పాలి. దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ఈ సీక్వెల్ తోను హిట్ కొడతాడనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: