నిన్నటిరోజున జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో పవన్ కళ్యాణ్ క్యూలో నిలబడకుండా ముందుకు వెళ్లి పోయిన సంఘటనను రిపోర్ట్ చేసిన ఒక మీడియా ప్రతినిధి సృష్టించిన రగడ పై చాలా కామెంట్స్ వచ్చాయి. సిఎమ్ అభ్యర్థి అయిన పవన్ కళ్యాణ్ క్యూలో ఉన్న జనాలని పట్టించుకోకుండా క్యూలో నిలబడకుండా నేరుగా వెళ్లి ఓటు వేశారని ఆమీడియా సంస్థకు చెందిన ప్రతినిధి సంచలనం సృష్టించే ప్రయత్నం చేశాడు.  

అంతేకాదు ఆసమయంలో ఓటింగ్ బూత్ దగ్గర ఉన్న ఓటర్ల చేత ఈవిషయం మాట్లాడించే ప్రయత్నం కూడ ఆమీడియా ప్రతినిధి చేసాడు. నిన్న జరిగిన ఈ ఎన్నికల హడావిడిలో ఈన్యూస్ కూడ కొద్దిసేపు సంచలనంగా మారింది. ఈ విషయమై చాలా మది పవన్ ను తప్పు పడుతూ కామెంట్స్ కూడ చేసారు. అయితే ఈవిషయమై ఫిలిం ఇండస్ట్రీలోని ఎవరు కామెంట్స్ చేయకపోయినా దర్శకుడు మారుతి ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 

‘ప్లీజ్ ప్రతి విషయాన్ని సంచలనం లాగా చిత్రీకరించ వద్దు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి క్యూలో నిలబడే పరిస్థితి ఉంటుందా’ అంటూ మారుతి ప్రశ్నించాడు. పవన్ కళ్యాణ్ ఉన్న చోట ఎలాంటి సెక్యూరిటీ సమస్యలు ఉంటాయో వివరిస్తూ మీడియా ప్రతినిధులు పవన్ కోసం తోపులాటకు గురవుతున్న ఫోటోలని మారుతి పోస్ట్  చేసాడు. అంతేకాదు  పోలింగ్ కేంద్రం  పవన్ క్యూలో నిలబడితే మరింత గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి కాబట్టే పవన్ క్యూలో నిలబడలేదని పవన్ కు సపోర్ట్ గా కామెంట్స్ చేసాడు. 

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా పవన్ కష్టపడి ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నంతసేపు పట్టించుకోని మారుతి ఎన్నికల ముగింపు వేళ ఇలా పవన్ కు సంఘీభావం చెప్పి ప్రయోజనం ఎంటి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మరికొందరైతే మారుతి కామెంట్స్ పై సెటైర్లు వేస్తూ రైలు ఆలస్యం అయిందని రైలులో పరుగులు తీసిన వ్యక్తిగా మారుతి ప్రవర్తన ఉంది అంటూ జోక్ చేస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: