పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా తెలుగు ప్రజలకు పరిచయమయిన ఈ పేరు.. మెగాస్టార్ చిరంజీవి..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్యే అనేంతగా మారు మ్రోగిపోతుందీ పేరు.


పవన్ కళ్యాణ్ కూడా... యాక్టర్, హీరోగానే కాకుండా, సామాజిక స్పృహతో తెలుగు ప్రజల పట్ల కలిగివుండే ప్రేమతో సినీ అభిమానుల ప్రేమనే కాకుండా, సామాన్య ప్రజల అభిమానాన్ని సైతం చూరగొన్నారు.


పవన్ కళ్యాణ్ ఆవేశం, సామాన్య ప్రజలతో ఆయన మమేకమయ్యే విధానం, యువకుల, ఆడపడుచుల బాధలను అర్థం చేసుకొని స్పందించే గుణం, అన్నింటికి మించి మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను, మా కష్ఠాలు నాకు తెలుసు నేను మీ కోసమే ఉన్నానని ఇచ్చే భరోసా.. నూటికి 80% పైగా ఉన్న మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించి పెట్టింది.


పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వమే ఒక సూదంటురాయి... మంచిని ఇట్టే ఆకర్షిస్తుందంటూ త్రివిక్రమ్ చెప్పినా..సుంకర దిలీప్, విష్ణు నాగిరెడ్డి వంటి వారు పవన్ గురించి మాట్లాడుతున్నపుడు గుండెల్లోంచి - కళ్ళల్లో తొంగిచూసే అభిమానం-ఆప్యాయత... చెప్పకనే చెబుతున్నాయి.


పవన్ కళ్యాణ్..చిరంజీవి తమ్ముడు అనే స్థాయి నుండి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అన్నయ్యే అనే స్థాయికి నడిపించింది.  అశేష ఆంధ్రులు, తెలుగు ప్రజల అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు సినీ, రాజకీయ రంగాల్లో వెలుగొందాలని అభిలాషిస్తూ..వెలుగొందే క్రమంలో మా పాత్ర నిర్వహిస్తామంటూ- ఇండియాహెరాల్డ్ గ్రూప్.



మరింత సమాచారం తెలుసుకోండి: