ఈరోజు విడుదలైన ‘చిత్రలహరి’ మూవీకి యావరేజ్ టాక్ రావడంతో ఈ వీకెండ్ లో కూడ ‘మజిలీ’ కలక్షన్స్ హవా కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. మూడు పరాజయాల తరువాత నాగచైతన్యకు ఒక హిట్ దొరకడం చైతు అభిమానులకు ఆనందంగా మారింది. 

సమంత హిట్స్ కొత్తేమి కాకపోయినా ఈమూవీలో సమంతకు మంచి పేరు వచ్చింది. ఈమూవీలో నటించిన నటీనటులు అంతా తమ పాత్ర పరిధిలో బాగా నటించినా ఈమూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఉత్తరాది అమ్మాయి దివ్యాంశ కౌశిక్ రావలసినంత పేరు రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. 

వాస్తవానికి ఈమూవీ ఫస్ట్ ఆఫ్ కథ అంతా ఈమె పైనే నడిచింది. ఈమూవీ సక్సస్ కావడంతో తనకు మంచి పేరుతో పాటు అవకాశాలు కూడ వస్తాయని భావించిన ఈ బ్యూటీకి జరుగుతున్న పరినామాణాలు షాక్ ఇస్తున్నట్లు సమాచారం. 
మజిలీ’ మూవీ పై ప్రశంసలు కురిపిస్తున్న వారు అంతా సమంతా నాగచైతన్యల జంట గురించి వారి నటన గురించి మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్కరూ దివ్యాంశ కౌశిక్ ను పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా మారింది. అంతేకాదు ఆమె చాల డేరింగ్ గా చైతన్యతో లిప్ లాక్ సీన్ లో నటించినా ఆ సీన్ యూత్ కు ఏమాత్రం కనెక్ట్ కాకపోవడంతో ఈమె నటించిన తొలి సినిమా విజయవంతం అయినా ఆమెకు అవకాశాల విషయంలో ప్రస్తుతానికి పెద్దగా కలిసి వచ్చే ఆస్కారం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: