2016 లో సంక్రాంతి బరిలో నిల్చున్న మూవీ ‘సోగ్గాడే చిన్నినాయనా’. కళ్యాన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయంలో కనిపించాడు.  రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించగా ముఖ్యపాత్రలో అనుష్క, యాంకర్ అనసూయ లు నటించారు.  ఈ సినిమాలో బంగార్రాజు పాత్ర ఎంతో పేరు తెచ్చుకుంది.  అసలు సినిమా మొత్తం ఆపాత్రపైనే తిరుగుతుంది.   'సోగ్గాడే చిన్నినాయనా' .. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఈ సినిమా సీక్వెల్ తీయాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నారు.  కాకపోతే మూడు సంవత్సరాల తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి తీసుకు వెళ్లే పనిలో ఉన్నారు. 


కళ్యాన్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాపేరు ‘బంగార్రాజు’గా నిర్ణయించారు.  అయితే ఈ సినిమాలో కథానాయికగా నయనతార అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారు. అయితే డేట్స్ ఖాళీ లేని కారణంగా తాను ఈ సినిమా చేయలేనని నయనతార చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. దాంతొో చంద్రముఖి సినిమాలో గంగా పాత్రతో మెప్పించిన జ్యోతికను తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  


15 యేళ్ల క్రితం నాగార్జున సరసన ఆమె 'మాస్' సినిమా చేసింది. రీ ఎంట్రీ తరువాత కథల ఎంపిక విషయంలో మరింత శ్రద్ధ వహిస్తోన్న జ్యోతిక, ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.  అయితే ఈ సినిమాలో మొన్నటి వరకు నాగార్జున మనవడిగా నాగ చైతన్య నటిస్తున్నారని వార్తలు వచ్చినా..ఆయన స్థానంలో అఖిల్ ని తీసుకుంటున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: