ఎన్నోకలలు ఎన్నోఊహాలు మరెన్నో ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయలలో ఎంట్రీ ఇచ్చి తన ‘జనసేన’ ను బలమైన రాజకీయ పక్షంగా మారి జనంలోకి చొచ్చుకుపోవాలని పవన్ చేసిన పోరాటం వృధాగా మారిందా అంటూ పవన్ అభిమానులు తీవ్రకలత చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

బలమైన టీడీపీ వైసీపీలను ఢీకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తనదైన ముద్రవేయాలని గత సంవత్సర కాలంగా తన సినిమాలను కూడ వదులుకుని పవన్ చేసిన ప్రయత్నం ‘నీటి బుడగగా మారిందా’ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి కామెంట్స్ రావడానికి గల కారణం పవన్ నిన్న సాయంత్రం ఎన్నికల పోలింగ్ ముగిసాక విజయవాడలోని తన ‘జనసేన’ పార్టీ కార్యాలయంలో చాల సేపు ఏకాంతంగా కూర్చుని సుదీర్ఘంగా ఆలోచన చేస్తున్నప్పుడు తీసిన ఫోటోలు ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. 

‘జనసేన’ పార్టీ కార్యాలయంలో అతి సామాన్యుడిగా నేల పై కూర్చొని పవన్ ఆలోచిస్తున్న ఫొటోలు ఇప్పుడు పవన్ అభిమానులకు కూడ వేదన కలిగిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఎన్నో ఆశలు పెట్టుకుని పోటీ చేసిన గాజువాక అసెంబ్లీ ఎన్నికలలో ఒక ఆసక్తికర విషయం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.  తెలుస్తున్న సమాచారం మేరకు ఈ అసెంబ్లీ స్థానంలో పవన్ ‘జనసేన’ కు మూడవ స్థానం మాత్రమే దక్కుతుంది అని అంటున్నారు. దీనికితోడు ఈ నియోజక వర్గంలో ఐదు రోజులుగా భారీస్థాయిలో తాయిలాలు పంచారు అన్న వార్తలు వస్తున్నాయి. 

మరింత ఆశ్చర్యంగా నిన్నటి పోలింగ్ రోజున చాలామంది పవన్ అభిమానులు ఓటింగ్ కు వచ్చినా ఈవీఎం లు మొరాయించడంతో కొందరు వెనక్కి వెళ్లిపోయారు అని తెలుస్తోంది. మరి కొందరైతే ఓటు వేయడానికి క్యూలైన్లలో గంటలపాటు నిరీక్షించాల్సిన పరిస్థితుల్లో చాలామంది అసహనంతో వెళ్ళిపోయినట్లుగా కూడ తెలుస్తోంది. ఇది చాలదు అన్నట్లుగా ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రిక పవన్ గాజువాకలో ఓడిపోతున్నాడు అంటూ ప్రచురించిన కథనం పవన్ అభిమానులకు మరింత నిరాశను కలుగు చేస్తోంది. పవన్ పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోతే ఆసలు ‘జనసేన’ కు భవితవ్యం ఉంటుందా అన్న సందేహాలు కలగడం సహజం..   


మరింత సమాచారం తెలుసుకోండి: