వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది బాలీవుడ్ మోడల్, నటి రకూల్ ప్రీత్ సింగ్.  టాలీవుడ్ లో యంగ్ హీరోలు తమకు జోడీగా రకూల్ అయితేనే బాగుంటుందని చెప్పేందగా గ్లామర్ డోస్ తో ఆకట్టుకుంది.  టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించిన రకూల్ ఈ మద్య బాలీవుడ్ లోకి వెళ్లడంతో తెలుగు లో ఛాన్సులు తగ్గాయి.  దాంతో ఆమె తమిళ, హిందీ భాషల్లో ఛాన్స్ ల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆమెకి బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది.

ఇంకేముంది..స్టార్ హీరో అజయ్ దేవగాన్ సరసన నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది.  ఇక వీరిద్దరూ కలిసి నటించిన 'దే దే ప్యార్ దే' సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో రకుల్ గ్లామర్ డోస్ కాస్త ఎక్కువైందనే కామెంట్స్ వినిపించాయి. బాలీవుడ్ లోకి వెళ్లిన చాలా మంది తెలుగు హీరోయిన్లు మోతాదుకు మించి తమ అందాలు ఆరోబోస్తుంటారు..అలాంటి వారిలో కొద్ది మంది మాత్రమే సక్సెస్ సాధించగలిగారు.   

తాజాగా ఈ మూవీ నుంచి ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.  ఈ సాంగ్ లో రకూల్ చీర కట్టులోనే కనిపిస్తూ..తన ఎద అందాలతో పిచ్చెక్కించింది.  చేతిలో మందు బాటిల్ పట్టుకొని తాగుతూ పంజాబీ స్టైల్ లో పాట పాడుతూ రచ్చ చేసింది. ఈ పాటను రకుల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా విడుదల చేసింది రకుల్.  తాజాగా ఈ పాట, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: