ఓ సినిమా హిట్ కి కధ, కధనం ఎంత ముఖ్యమో మంచి కాస్టింగ్ కూడా అంతే ముఖ్యం. కొన్ని సినిమాల్లో కధ బాగున్నా కాస్టింగ్ సరిగ్గా లేకపోతే సినిమా ఫ్లాప్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 
అందుకే హీరో నాగార్జున కాస్టింగ్ విషయంలో ఎపుడూ మంచి సెలెక్టివ్ గా ఉంటారని అంటారు.


నాగ్ ఇపుడు మళ్ళీ జోరు పెంచారు ఓ వైపు మన్మధుడు 2 మూవీని రెడీ చేస్తూనే మరో వైపు బంగార్రాజు మూవీని కూడా ముందుకు తెస్తున్నారు. మూడేళ్ళ క్రితం వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన మూవీ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా నాగ్ ఈ కొత్త మూవీని సిధ్ధం చేస్తున్నారు.



ఇందులో మొదట నాగ్ కి జోడీగా నయన తారని అనుకున్నారు. అయితే ఆమె నో చెప్పడంతో ఇపుడు సీనియర్ నటీమణి జ్యోతికను ఓకే చేశారని టాక్ వినిపిస్తోంది. జ్యోతికి అయితే ఈ మూవీ బాగా పండుతుందని నాగ్ తో సహా చిత్ర యూనిట్ అనుకుంటున్నారుట. ఇక జ్యోతిక నాగ్ తో మాస్ మూవీని చేసింది. అప్పట్లో అది సెన్సేషనల్ హిట్. మళ్ళీ ఈ మూవీతో ఈ జంట మరో హిట్ కొడతారా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: