ఎనర్జిటిల్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. `డబుల్ దిమాక్` ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. 

ఈ సాంగ్‌లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా నటేష్ ఇద్ద‌రూ రామ్‌తో న‌టిస్తున్నారు. రీసెంట్‌గా దిమాక్ ఖ‌రాబ్ అంటూ తెలంగాణ యాస‌లో సాగే ఈ పాటకు సంబంధించి నిధి అగ‌ర్వాల్ లుక్‌కు చాలా మంచి స్పంద‌న‌వ వ‌వ్చింది. లెటెస్ట్‌గా న‌భా న‌టేశ్ ఫోటోలు విడుద‌ల‌య్యాయి. ఇందులో న‌భా న‌టేష్ స‌రికొత్త లుక్‌లో, రూర‌ల్ స్టైల్లో ఆక‌ట్టుకుంటుంది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం వ‌హించారు. 

న‌టీన‌టులు: రామ్, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌, పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌,మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను,సుధాంశు పాండే త‌దిత‌రులు 
సాంకేతిక వ‌ర్గం: ఫైట్స్‌:  రియ‌ల్ స‌తీష్‌, సాహిత్యం:  భాస్క‌ర‌భ‌ట్ల‌, ఎడిట‌ర్‌:  జునైద్ సిద్ధికీ, ఆర్ట్‌:  జానీ షేక్‌,  సినిమాటోగ్ర‌ఫీ:  రాజ్ తోట‌, మ్యూజిక్‌:  మ‌ణిశ‌ర్మ‌
నిర్మాత‌లు:  పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌, ద‌ర్శ‌క‌త్వం:  పూరి జ‌గ‌న్నాథ్‌.



మరింత సమాచారం తెలుసుకోండి: