వచ్చే వారం విడుదల కాబోతున్న ‘జెర్సీ’ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. పూర్తిస్థాయి ఎమోషనల్ కంటెంట్ తో కట్ చేసిన ఈ ట్రైలర్ అందరికీ బాగా నచ్చింది. అయితే ఈమూవీ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్న నానీకి మాత్రం లోలోపల ఒక భయం వెంటాడుతున్నట్లు టాక్. 

సాధారణంగా ఒక మూవీ హిట్ అయిన తరువాత అదే మూవీ కథ షేడ్స్ తో వచ్చే సినిమా వెంటనే అదే నెలలో విడుదలైతే ఆమూవీ హిట్ అయిన సందర్భాలు చాల తక్కువ. దీనికితోడు ఉగాదికి వచ్చిన ‘మజిలీ’ వచ్చే వారం రాబోతున్న ‘జెర్సీ’ ఈ రెండు సినిమాలు క్రికెట్ చుట్టూనే తిరుగుతాయి. 

అయితే కథ విషయంలో సారుప్యత ఉన్నా కథ ప్రజంటేషన్ లో చిన్నచిన్న తేడాలు కనిపిస్తాయి అని టాక్. యంగ్ ఏజ్ లో క్రికెటర్ పాత్ర పోషిస్తున్న నాని శ్రద్దా శ్రీనాథ్ తో ప్రేమలో పడడం పెళ్లి తరువాత ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఉండడం భార్య దగ్గర డబ్బులు తీసుకోవడం భార్య చేత పడరాని తిట్లు తినడం తిరిగి 10ఏళ్ల తరువాత మళ్ళీ క్రికెటర్ గా లైఫ్ స్టార్ట్ చేయడం వంటి ఎన్నో ట్విస్ట్ లు ఉన్నాయి. 

అయితే కథ అంతా క్రికెట్ నేపధ్యంలో జరుగుతూ ఉండటంతో మరో క్రికెట్ ఎమోషనల్ డ్రామాను చూడటానికి ప్రేక్షకులు ఎంతవరకు అంగీకరిస్తారు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గత సంవత్సరం నాని నటించిన రెండు సినిమాలు ఫెయిల్ అయిన నేపధ్యంలో ఈమూవీ విజయం నానీకి అత్యంత కీలకం. ఈమూవీకి సుమారు 40 కోట్లకు పైగా బిజినెస్ అయిన నేపధ్యంలో ఎట్టి పరిస్తుతులలోను ఈమూవీ 50 నెట్ కలక్షన్స్ సాధించి తీరాలి. ఇలాంటి పరిస్థుతులలో ఒకే రకం కథ ఉన్న సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుంది అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలు ఈమూవీ ఫలితం ఎదురు చూస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: