అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ డైరక్షన్ లో అంచనాలతో వచ్చిన సినిమా మజిలీ. షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ కూడా హీరోయిన్ గా నటించింది. 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.


రియల్ లైఫ్ లో భార్యా భర్తలైన చైతు, సమంత తెర మీద కూడా హస్బెండ్ అండ్ వైఫ్ గా నటించడంతో మజిలీకి మరింత క్రేజ్ ఏర్పడింది. ఇక సినిమాకు అనుకున్న విధంగా పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకి మంచి వసూళ్లు వచ్చాయి. మొదటి వారంలోనే లాభాల బాట పట్టింది మజిలీ.


ఇక ఏరియాలవారిగా మజిలీ కలక్షన్స్ వివరాలు చూస్తే..


నైజాం : 9.05 కోట్లు  
సీడెడ్: 2.82 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.07 కోట్లు
కృష్ణ: 1.45 కోట్లు
గుంటూరు: 0.63 కోట్లు
ఈస్ట్ : 1.30 కోట్లు
వెస్ట్: 0.99 కోట్లు
నెల్లూరు:  0.57 కోట్లు
ఎపీ/ తెలంగాణా : 20.88 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 2.50 కోట్లు
ఓవర్సీస్: 2.75 కోట్లు
వరల్డ్ వైడ్ : 26.13 కోట్లు  



మరింత సమాచారం తెలుసుకోండి: