‘మజిలీ’ మూవీ తరువాత శివ నిర్వాణ పేరు మారు మ్రోగిపోతోంది. ‘ఎఫ్ 2’ సక్సస్ తరువాత రియల్ హిట్ ‘మజిలీ’ మాత్రమే అని అంటున్నారు. ఇప్పటికే రెండు వరస విజయాలు పొందిన ఈ క్రియేటివ్ దర్శకుడుతో సినిమాలు చేయాలని కొందరు టాప్ హీరోలు ప్రయత్నాలు చేస్తున్నా వారి పిలుపుకు శివ నిర్వాణ పెద్దగా స్పందించడం లేదు అని వార్తలు వస్తున్నాయి. 

దీనికి కారణం ప్రస్తుతం శివ నిర్మాణ దృష్టిలో టాప్ హీరోలు ఎవరు లేరని ఒక్క విజయ్ దేవరకొండ మాత్రమే ఉన్నాడని టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమధ్య శివ నిర్వాణ విజయ్ దేవరకొండను కలిసి ఒక మంచి సబ్జెక్ట్ ను చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్టోరీ లైన్ విజయ్ కి నచ్చడంతో ఈ స్టోరీని డెవలప్ చేయమని శివ నిర్వాణకు చెప్పినట్లు తెలుస్తోంది. 

విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ కి అనుగుణంగా ఉండే ఈకథను నిర్మించడానికి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే ముందుకు వచ్చినట్లు టాక్. అయితే విజయ్ దేవరకొండ ఒప్పుకున్న సినిమాలు అన్నీ పూర్తి కావడానికి మరొక సంవత్సరం పట్టే ఆస్కారం ఉన్న నేపధ్యంలో అంత కాలం ఖాళీగా కూర్చోవడానికి ఈ దర్శకుడు ఇష్టపడటం లేదు అని వార్తలు వస్తున్నాయి. 

దీనితో తన దగ్గర ఉన్న కథకు సరిపోయే మిడిల్ రేంజ్ హీరో అన్వేషణలో ప్రస్తుతం ఈ దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. ‘మజిలీ’ షూటింగ్ సమయంలో సమంత అఖిల్ ను దృష్టిలో పెట్టుకుని ఒక కథను క్రియేట్ చేయమని అడిగినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం శివ నిర్వాణ దృష్టిలో ఉన్న ఆ హీరో ఎవరు అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: