తెలుగు ఇండస్ట్రీలో అంకుశం, ఆహుతి లాంటి చిత్రాలతో యాంగ్రీ యంగ్ మేన్ గా పేరు తెచ్చుకున్నాడు డాక్టర్ రాజశేఖర్.  ఆ తర్వాత కొన్ని యాక్షన్ చిత్రాల్లో నటించిన ఆయన రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ‘అల్లరి ప్రేమికుడు’ చిత్రంతో రొమాంటిక్ హీరోగా మారు..ఆ తర్వాత ఫ్యామిలీ తరహా చిత్రాలు తీశాడు.  తర్వాత క్రమంలో రాజశేఖర్ నటించిన చిత్రాలకు ప్రాధాన్యత తగ్గడంతో ఇండస్ట్రీకి కొంత కాలం దూరంగా ఉంటూ వచ్చారు.  ఆ మద్య ‘గరుడవేగ’హిట్‌తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు యాంగ్రీమెన్‌ రాజశేఖర్‌. 

ప్రస్తుతం యంగ్‌డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మతో కలిసి కల్కి చిత్రాన్ని చేస్తున్నారు.  ఇటీవల రాజశేఖర్ పుట్టిన రోజు సందర్బంగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు.  టీజర్ తో  చిత్రంపై పై హైప్‌ను క్రియేట్‌ చేశారు మేకర్స్‌. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథేంటన్నది సినీ లవర్స్ లో చర్చనీయాంశంగా మారింది.   అయితే ఈ చిత్రం కథ విషయానికి వస్తే..ఇది 1985 నాటి కాలం పరిస్థితులకు అద్దం పట్టే విధంగా డైరెక్షన్ చేశారట. కృష్ణా జిల్లాలో ముగ్గురు ధనవంతుల మద్య సాగే అంతర్యూద్దం ప్రత్యర్థులను హతమార్చేందుకు నీటిలో విషం కలుపుతారు. ఆ సమయంలో గుంటూరు జిల్లాలో వరసగా మిస్టీరియస్ గా మర్డర్స్ జరుగుతూంటాయి. 

అయితే ఈ రెండింటి మద్య లింక్ ఏంటీ..అసలు ఏం జరుగుతుందనే విషయంపై ఇన్వేస్టిగేషన్ చేయడానికి ఆఫీసర్ గా డాక్టర్ రాజశేఖర్ ఎంటర్ అవుతారట. ఈ చిత్రం కథ..కల్కి అనే పేరు కి లింక్ ఏంటనేది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని ఫిలిమ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇది కేవలం ఫిలిమ్ వర్గాల్లో వస్తున్న రూమర్ మాత్రమే..అసలు చిత్రం కథ ఏంటో రిలీజ్ అయితే కానీ తెలియదు.  రాజశేఖర్ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అంటున్నారు చిత్ర దర్శకనిర్మాతలు.  ఆదాశర్మ, నందితా శ్వేతలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని సి. కళ్యాణ్‌ నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: