ఆమె అందగత్తె. మంచి సినిమాలే చేసింది. చక్కటి గ్రుహిణి పాత్రల్లో ఆమె ఇమిడిపోయింది. హాట్ మూవీస్ ని కూడా చేసి కుర్ర కారుకు కిర్రెక్కించేసింది. టాప్ హీరోల పక్కన కూడా యాక్ట్ చేసి తనదైన బ్రాండ్ వేసుకుంది.



ఆమె ఎవరో కాదు నిన్నటి నటి సంగీత. ఆమె గురించి షాకింగ్ న్యూస్ ఇపుడు వైరల్ అవుతునది. తన కన్నతల్లిని ఇంటి నుండి వెళ్లిపోమని హీరోయిన్ సంగీత ఆమెపై ఒత్తిడి తీసుకురావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆమె తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది. వివరాల్లోకి వెళితే.. నటి సంగీత తల్లి పేరు భానుమతి. ఈమె స్థానిక వలసరవాక్కంలో నివసిస్తున్నారు. ఆ ఇల్లు తన మామగారి నుండి ఆమెకి వచ్చింది. ఇంట్లో కింద భాగంలో భానుమతి నివసిస్తుండగా.. పైభాగంలో నటి సంగీత తన భర్తతో కలిసి జీవిస్తోంది. ఇల్లు ప్రస్తుతం నటి సంగీత పేరుతోనే ఉంది. దీంతో ఆ ఇంటికి వదిలి వెళ్లిపోమని సంగీత తన తల్లిని ఒత్తిడికి గురి చేస్తోంది. దీంతో భానుమతి తమిళనాడు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.



సంగీత ఇంటిని తన అన్నయ్య, తమ్ముడు అపహరిస్తారనే భయంతో ఇల్లు వదిలి వెళ్లిపోమని చెబుతోందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా.. మొన్నామధ్య సంగీత తమ్ముడు మరణించాడు. భానుమతి వయసు పైబడడంతో బయటకి వెళ్లలేని పరిస్థితి. దీంతో ఆమె ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడకి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.దీనిపై వివరణ ఇవ్వాలని సంగీతకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీంతో సంగీత తన భర్తతో కలిసి మహిళా కమిషన్ ఎదుట హాజరైంది. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధించి మీడియా ఆమెని ప్రశ్నించగా.. తన వ్యక్తిగత విషయాల గురించి బదులివ్వనని, సినిమాల గురించి కావాలంటే అడగమని చెప్పింది.  మొత్తానికి చూసుకుంటే మనిషి అందంగానే ఉంటుంది, కానీ మనసు ఇలాంటిదా అని ఆమె ఒకనాటి అభిమానులు అనుకోవాల్సివస్తోంది. కన్న తల్లి మీద ఆమె కఠినంగా ఉండడం, ముసలి వయసులో వెళ్ళిపోమని చెప్పడం అంతా తప్పు పడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: