నభా నటేష్. మహేష్ బావ సుధీర్ డిస్కవరీ ఈ బ్యూటి. అతనితో చేసిన ఫస్ట్ మూవీ ఫట్ అయినా నభా తన గ్లామర్ తో టాలీవుడ్లో పాగా వేయాలని చూస్తోంది. ఆమె ఇపుడు ఓ కరెక్ట్  డైరెక్టర్  చేతిలో పడిందని అంటున్నారు. నభా నటేష్‌ని నఖ శిఖ పర్యంతం చూపించేందుకు ఆ  డైరెక్టర్  ర్ శక్తి వంచన లేకుండా ట్రై చేస్తున్నాడుట. దెబ్బకు ఆ మూవీ హిట్ అయితే నభా అబ్బా అనిపించడం ఖాయమని అంటున్నారు.



లేటెస్ట్ గా రామ్,  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' లో నభా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా చిత్రం బృందం హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్లో 'దిమాక్ ఖరాబ్' అనే పాటను చిత్రీకరింంచారు.తెలంగాణ టచ్‌తో సాగే దిమాక్ ఖరాబ్' పాటకు శేఖర్ మాస్టర్ కొనియోగ్రఫీ కంపోజ్ చేశారు. 
రామ్ పోతినేని, నభా నటేష్‌లపై చిత్రీకరించిన ఈ పాటకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ అయ్యాయి.



ఇందులో నభా నటేష్ సూపర్ హాట్ లుక్ చూస్తుంటే నిజంగానే రేపు థియేటర్లలో ప్రేక్షకుల మతి పోగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ పాటకు మణిశర్మ అందించిన బీట్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. 'దిమాక్ ఖరాబ్' పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా, కీర్తన శర్మ, సాకేత్ ఆలకించారు. రామ్ అభిమానులను ఊర్రూతలూగించే విధంగా ఈ పాట ఉంటుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ సాంగ్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: