హీరోయిన్స్ ఇప్పుడు అందాలను ఆరబోయటంలో అస్సలు ఆలోచించడం లేదు. అభిమానులకు టెంపరేచర్ పెంచేస్తున్నారు. బాలీవుడ్ సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి ఎవెలిన్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తాజాగా ఈ ఎవెలిన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఒక బీచ్.. చుట్టూ కొండలు.. ఇసుకలో జస్ట్ అలా పడుకొని నవ్వింది.


 కానీ ఇన్నర్ లాగే ఉండే టాప్ కావడంతో చక్కనైన ఆమె పరువాలు కెమెరా కంటికి చిక్కాయి. అసలే గ్లోబల్ సుందరి.. ఇలాంటి పోజిస్తే నెటిజనులు ఏమైపోవాలి? అందుకే లైకులమీద లైకులుకొట్టి తమ జేజేలు తెలిపారు.  ఈ ఫోటోకు ఎవెలిన్ ప్రేమ అని.. సూర్యుడు కాంతి అని ఏదో అర్థం కాని.. బాగా కష్టపడితే కానీ అర్థం చేసుకోలేని క్యాప్షన్ ఇచ్చింది.  అయినా మన పిచ్చిగానీ ఆమె క్యాప్షన్ ను అర్థం చేసుకునేందుకు ఎంతమంది ప్రయత్నిస్తారు?


సూర్యకాంతిలో మెరుస్తున్న ఆమె అందాలను కళ్ళతో జుర్రుకునేందుకు ప్రయత్నిస్తారు!ఎవెలిన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రభాస్ 'సాహో' లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది.  ఇన్స్టాగ్రామ్ ఫోటోలకే ఇలా అందాలను ఆరబోస్తే.. 'సాహో' సినిమాలో పాప గ్లామర్ పరిస్థితి ఏంటి?  సుబ్బయ్య హోటల్ లోని విస్తరాకులో కూరలు వడ్డించినట్టు అన్నీ అందాలను టోకున వడ్డించడమే! 

మరింత సమాచారం తెలుసుకోండి: