సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా వరసపెట్టి సినిమాలు చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి మెగా స్టార్ చిరంజీవికి కలిసి వచ్చిన ‘రాక్షసుడు’ మూవీ టైటిల్ ను సెంటిమెంట్ గా మార్చుకుని అదే టైటిల్ తో వచ్చిన తమిళ సినిమా ‘రాక్షసన్’ కు రీమేక్ ‘రాక్షసుడు’ లో నటిస్తున్నాడు. అయితే ఈసినిమాను  కేవలం  నలభై వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేయడమే కాకుండా కేవలం ఈమూవీని 15 బడ్జెట్ లో పూర్తి చేయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

ఇప్పటివరకు బెల్లంకొండ నటించిన సినిమాలు అన్ని భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో ఇప్పటికే ఈసినిమాను అవుట్ రేట్ గా ఈసినిమా ఫస్ట్ కాపీని చూసి అభిషేక్ పిక్చర్స్ వరల్డ్ వైడ్ రైట్స్ నిమిత్తం 20 కోట్లకు కొనడం మరింత షాకింగ్ గా మారింది. దీనితో ఇంత తక్కువ ఖర్చుతో ఈసినిమా ఎలా పూర్తి అయింది అని ఎంక్వయిరీ చేసిన వారికి కొన్ని షాకింగ్ విషయాలు తెలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ తెలుగు రీమేక్ అయినప్పటికీ  తమిళ  సినిమాలో సగం పార్ట్ ను దాదాపుగా తెలుగులో వాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు రీమేక్ రైట్స్ కొన్నపుడే డిసైడ్ చేసి అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తోంది.  ముఖ్యంగా ఈసినిమా హీరో హీరోయిన్లు లేకుండా ఉన్న సీన్లు అన్నీ చాలతెలివిగా ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది.   

హీరో హీరోయిన్లు లేకుండా ఉన్న సీన్లు అన్నీ కూడ తెలుగు రీమేక్ కు ఉపయోగించినట్లు టాక్. దీనివల్ల ఈమూవీ ఖర్చు తగ్గడమే కాకుండా ఈమూవీని వేగంగా పూర్తి చేయడానికి సహకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈప్రయోగం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈప్రయోగం సక్సస్స్ అయితే చిన్నహీరోల సినిమాల రీమేక్ లో భవిష్యత్ లో ఇలాంటి ప్రయోగాలు చాలా చేసే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: