ప్రస్తుతం కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో ‘దర్భార్’సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత రజినీ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట.  గతంలో ఆయన పోలీస్ గా నటించిన ఎన్నో సినిమాలో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.  ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో రజినీ కనిపించబోతున్నారట.  నయనతార హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. నివేదా థామస్ ఓ కీలక పాత్ర చేస్తోందనే టాక్. 

ఈ మద్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు..ఈ పోస్టర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ పోస్టర్ పై రక రకాల రూమర్లు వస్తున్నాయి.  గతంలో హాలీవుడ్ మూవీ కిల్లింగ్ గంతర్ అనే హాలీవుడ్ మూవీ పోస్టర్ ని కాపీ చేసినట్టుగా ఉండటం ఫ్యాన్స్ షాక్ తిన్నారు. ఇంకేముంది ఇది కాస్త సోషల్ మీడియాలోకి ఎక్కడంతో రచ్చ షురు అయిపోయింది.  మన దేశంలో క్రియేటివిటీకి కొదవే లేదు..లేనిది ఉన్నట్టు..ఉన్నది లేనట్టుగా ఎన్నో రకాల డిజైన్లు చేసేవారు ఉన్నారు.

అలాంటపుడు ఎప్పడో పాత మూవీ స్టైల్ పోస్టర్ కాపీ కొట్టడం ఏంటి మరీ ఛండాలంగా అని అంటున్నారు ఫ్యాన్స్.  అదీ కాక మురుగదాస్ మంచి క్రియేటివిటీ ఉన్న దర్శకుడు..చేతిలో టైం వనరులు ఉన్నప్పుడు కొత్తగా ఏదైనా చేయాలి కాని ఇలా కాపీ కొట్టడం ఏంటి దాసూ అని నెటిజెన్లు అప్పుడే కామెంట్లు విసురుతున్నారు. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన ట్రెండ్ లో జాగ్రత్తగా ఉండకపోతే ఎలా అంటున్నారు రజినీ హార్డ్ కోర్ ఫ్యాన్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: