మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన సినిమా చిత్రలహరి. సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అవడంతోనే ప్రేక్షకుల్లో ఓ పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే తేజ్ ఇదవరకు సినిమా ఎఫెక్ట్ తో లో బడ్జెట్ లో తీసిన చిత్రలహరి శుక్రవారం రిలీజై పర్వాలేదు అన్న టాక్ తెచ్చుకుంది. లైఫ్ లో సక్సెస్ అనేదే లేని ఫెయిల్యూర్ పాత్రలో సాయి తేజ్ మెప్పించాడు.


ఇక హీరోయిన్స్ లో కళ్యాణి ప్రియదర్శన్ క్యూట్ లుక్స్ సినిమాకు ప్లస్ అయ్యాయని చెప్పాలి. సుప్రీం తర్వాత తిక్క నుండి లాస్ట్ ఇయర్ వచ్చిన తేజ్ ఐలవ్యూ వరకు సాయి తేజ్ వరుసగా 6 సినిమాలు ఫ్లాప్ అందుకున్నాడు. అయితే చిత్రలహరితో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో వచ్చాడు తేజ్.


కిశోర్ తిరుమల ఇంకా ఈ కథను గ్రిప్పింగ్ గా చెప్పి ఉంటే ఏ డౌట్ లేకుండా సూపర్ హిట్ అనే అవకాశం ఉండేది. కాని కొన్ని పొరపాట్ల వల్ల సినిమా అక్కడక్కడ బ్యాక్ అయ్యింది. ఓవరాల్ గా ఫెయిల్యూర్స్ ఉన్న యూత్ ఆడియెన్స్ కు ఈ సినిమా కనెక్ట్ అయ్యింది అది చాలు. అందుకే సినిమాకు రివ్యూస్ యావరేజ్ గా వచ్చిన మౌత్ టాక్ బాగుందనే అంటున్నారు.


సో చిత్రలహరితో తేజ్ ఒడ్డున పడినట్టే అని చెప్పొచ్చు. సాయి తేజ్ లుక్ కూడా ఈ సినిమాలో చర్చగా మారింది. ఫైనల్ గా చిత్రలహరితో హమ్మయ్య అనిపించుకున్న సాయి తేజ్ ఇక నుండి కథల విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే బెటర్. మరి రానున్న రోజుల్లో సాయి తేజ్ ఏం చేస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: