టాలీవుడ్ లో సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న సినీ నటి జయసుధ ఒకప్పుడు అందాల నటిగానే కాదు..సహజనటనకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. స్టార్ హీరోలందరితో నటించిన జయసుధ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వత తల్లి,అత్త, అమ్మమ్మ పాత్రల్లో నటిస్తుంది.  ఆ మద్య రాజకీయాల్లోకి వెళ్లిన జయసుధ కాంగ్రెస్, టీడీపీ ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు.  ఇక తెలుగు టివి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న జబర్ధస్త్ కార్యక్రమంలో ఇటీవల కొత్త జడ్జీలు వస్తున్న విషయం తెలిసిందే. 

గత ఏడు సంవత్సరాలుగా మెగా బ్రదర్ నాగబాబు, నటి, ఎమ్మెల్యే రోజు అలరిస్తూ వస్తున్నారు.  ఈ మద్య ఏపిలో ఎన్నికల సందర్భంగా వీరిద్దరూ పోటీ చేస్తున్న నేపథ్యంలో జబర్ధస్త్ కి విరామం ఇచ్చారు.  అయితే ఈ విరామం శాశ్వతంగానా..లేదా కొద్ది కాలమేనా తెలియాల్సి ఉంది.  అయితే నాగబాబు, రోజా  రీప్లేస్ చేసే ప్రాసెస్ లో జబర్దస్త్ నిర్వాహకులు సీనియర్ నటి జయసుధని సంప్రదించారట. కానీ ఆ ఆఫర్ ని ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. 

కొంత కాలంగా జయసుధ కుటుంబ తరహా సినిమాల్లో నటిస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకుంది..ఇలాంటి సమయంలో వల్గర్ కామెడీ తనకు సూట్ అవ్వదని జయసుధ సున్నితంగా తనకు వచ్చిన ఆఫర్ ని నిరాకరించినట్లు తెలుస్తోంది.  ఈ కార్యక్రమానికి జయసుధకు భారీగానే రెమ్యూనరేషన్ ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకున్నా..ఆమె మాత్రం  రాజీ పడలేదని సమాచారం.

జయసుధ ఇలాంటి నిర్ణయం తీసుకొని మంచి పని చేసిందని, ఆమెకి ఇలాంటి వల్గర్ కామెడీ షోలు సెట్ కావని సినీ పరిశ్రమలో కొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: