తెలుగు ఇండస్ట్రీలో అల్లు వారి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్.  స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  ఆ తర్వాత ఆర్య, దేశముదురు, బన్ని చిత్రాలతో ఒక్కసారే స్టార్ హీరోగా మారిపోయాడు.  ఇండస్ట్రీలో మెగా ఫ్యాన్స్ ఎక్కువగా అభిమానించే హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు.  సాధారణంగా కొంత మంది స్టార్ హీరోలు తమ ఫ్యాన్స్ కోరిక మేరకు వారితో ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడుతుంటార...కొంత మంది మాత్రం ఫ్యాన్స్ ని ఊరికే నసపెట్టకండీ అంటూ తమ బౌన్సర్లతో పక్కకు తోయించేస్తుంటారు. 

ఇక అల్లు అర్జున్ స్టైల్ కు..యాక్టింగ్,  డ్యాన్సులు మాత్రమే కాదు.. బన్నీకి మంచి మనసు కూడా ఉందని పలు సందర్భాలలో నిరూపిస్తూనే ఉన్నాడు.  ఈ రోజు త్రివిక్రమ్, అల్లు అర్జున్ ల కొత్త చిత్రం షూటింగ్ ముహూర్తం ప్రారంభం అయ్యింది.  ఈ  చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈ కార్యక్రమానికి హాజరవడానికి తన కారులో వస్తున్న అల్లు అర్జున్ కి ఇద్దరు ఫ్యాన్స్ రోడ్డు పక్కన నిలబడి చేయి ఊపారు..అంతే ఒక్కసారిగా కారు ఆపి..  కారు దిగి వారి దగ్గరకు వెళ్ళాడు. 

అయితే ఆ పిలిచిన అభిమానులు  పొట్టిగా ఉండడంతో కిందకు ఒంగి కూర్చుని వారిపై చేతులు వేసి నవ్వుతూ పోజిచ్చాడు.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.  అయితే  బన్నీ ఇలా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇవ్వడం మొదటిసారేమీ కాదు.  అనారోగ్యంతో బాధపడే తన ఫ్యాన్స్ ను గతంలో స్వయంగా వెళ్లి మరీ కలిసిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: