‘ఆర్ ఆర్ ఆర్’ మూవీతో అలియా భట్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచియం చేస్తున్ననేపధ్యంలో  ఆమె మ్యాజిక్ ఆ సినిమా ఘన విజయానికి ఎంతమేరకు సహకరిస్తుంది అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అలియా భట్ కు బాలీవుడ్ లో కొనసాగుతున్న క్రేజ్ రీత్యా ఆమె పారితోషికం విషయంలో అదే విధంగా ఆమె డేట్స్ విషయంలో రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ కూడ కొంతవరకు రాజీ పడవలసి వచ్చింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

ఇలాంటి పరిస్థుతులలో అల్లు అర్జున్ తన మూవీలో అలియా భట్ ను హీరోయిన్ గా ఎంపిక చేయమని అడిగినట్లుగా వస్తున్న వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీని నాలుగు నెలలలో పూర్తి చేసి ఈ ఏడాది నవంబర్ ప్రాంతం నుండి దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటించబోయే సినిమాకు లైన్ క్లియర్ చేసాడు. 

ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన స్క్రిప్ట్ అంతా పూర్తి కావడంతో ఈమూవీని కూడ వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చి నుండి సుకుమార్ మూవీ ప్రాజెక్ట్ వైపు వెళ్ళి పోవాలని బన్నీ ప్లాన్ అని అంటున్నారు. ఈమూవీకి దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో ఈమూవీ హీరోయిన్ గా అలియా భట్ ను ఎంపిక చేయమని అల్లు అర్జున్ దిల్ రాజ్ పై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. 

అయితే అలియా భట్ డేట్స్ విషయం ఒక సమస్య మాత్రమే కాకుండా ఆమె పారితోషికం కూడ ఒక సమస్య. ఆమె ఏ సినిమాకు అయినా 5 కోట్లకు తక్కువ కాకుండా పారితోషికం తీసుకోదు. దీనికితోడు ఆమె డేట్స్ విషయంలో కూడ చాల సమస్యలు సృష్టిస్తుంది. ఇలాంటి పరిస్థుతులలో బన్నీ కోర్కెను దృష్టిలో పెట్టుకుని దిల్ రాజ్ ప్రయత్నాలు చేసినా అల్లు అర్జున్ తో నటించడానికి అలియా భట్ అంగీకరిస్తుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: