రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో అలియా భట్ ఓ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసిన డైసీ ఎడ్గర్ జోన్స్ హ్యాండ్ ఇవ్వడంతో ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ ను వెతుకుతున్నారు రాజమౌళి. 


రాం చరణ్ సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఆర్.ఆర్.ఆర్ లో తారక్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. చరణ్ కు జోడీగా అలియా భట్ అలియా భట్ నటిస్తుంది. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అయిన అలియా భట్ తెలుగులో చేసే మొదటి సినిమా అదే. అయితే ఈలోగా చరణ్ తో జత కడుతున్న అలియా మీద స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కన్నేశాడు.  


ప్రస్తుతం చేస్తున్న త్రివిక్రం సినిమా పూర్తికాగానే ఐకాన్ అంటూ దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు శ్రీరాం డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో బన్నికి జోడీగా అలియా భట్ ను సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. అలియా భట్ తెలుగులో నటించడానికి భారీ పారితోషికం ఆశిస్తుంది. ట్రిపుల్ ఆర్ అంటే 400 కోట్ల బడ్జెట్ తో వస్తుంది కాబట్టి ఆమెను భరించగలరు మరి బన్ని సినిమా కోసం అలియా కోరినంత వీరు ఇవ్వగలరా అన్నది చూడాలి.


ఒకవేళ ఐకాన్ సినిమా అలియా చేస్తే కనుక చరణ్, బన్ని ఇద్దరు మెగా హీరోలతో వెంట వెంట సినిమాలతో అలియా భట్ తెలుగులో కూడా అదరగొట్టే అవకాశం కనిపిస్తుంది. ఎలాగు బాలీవుడ్ లో అందం, అభినయంతో దుమ్ముదులిపేస్తున్న అలియా భట్ టాలీవుడ్ వైపు అడుగులేయడం ఇక్కడ స్టార్ హీరోయిన్స్ కు షివరింగ్ తెప్పిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: