బాహుబలి తర్వాత రాజమౌళి భారీ సినిమానే చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు టాలీవుడ్ సూపర్ స్టార్స్ ను ఒకే సినిమాలో అది కూడా భారీ బడ్జెట్ మూవీ షురూ చేశాడు. రియల్ లైఫ్ హీరోస్ అయిన సీతారామరాజు, కొమరం భీం ఇద్దరి పాత్రల్లో రాం చరణ్, తారక్ ఇద్దరు కనిపించనున్నారు. ఆల్రెడీ ఆ పాత్రల కోసం వారి వేషధారణ మార్చేస్తున్నారు.


అయితే ఇదవరకు తన సినిమాల్లా ఆర్.ఆర్.ఆర్ కోసం మరి ఎక్కువ టైం తీసుకునే ఆలోచనలో లేడు రాజమౌళి. అందుకే 2020 జూలై 31న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అంటూ ఎనౌన్స్ చేశాడు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాం చరణ్ భారీ ప్లాన్ లోనే ఉన్నాడు. ఇప్పటికే వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా డిస్కషన్స్ లో ఉందని తెలుస్తుంది.


ఇక ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ ఎవరితో సినిమా చేస్తాడు అన్నది తెలియాల్సి ఉంది. కనీసం డిస్కషన్స్ లో కూడా ఏది లేదు. మరి ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ ఏ సినిమా చేస్తాడన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. మహేష్ కూడా మహర్షి తర్వాత వెంటనే అనీల్ రావిపుడితో సినిమా చేస్తాడని తెలుస్తుంది.


బన్ని కూడా త్రివిక్రం సినిమా అలా మొదలు పెట్టాడో లేదో మరో సినిమా వేణు శ్రీరాం డైరక్షన్ లో షురూ చేశాడు. మరి అందరు చేస్తున్న సినిమా కాకుండా మరో సినిమా కూడా లైన్ లో పెట్టుకోగా తారక్ మాత్రం తన నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించలేదు. మరి యంగ్ టైగర్ తో ఆర్.ఆర్.ఆర్ తర్వాత సినిమా తీసే లక్కీ ఛాన్స్ ఏ డైరక్టర్ పొందుతాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: