తెలుగు సినిమా రంగం చాలా పెద్దది. వందల కోట్ల బిజినెస్ చేసే కెపాసిటి ఉన్న అతి పెద్ద ఇండస్ట్రీ. ఈజీగా వంద కోట్లను తీసుకువచ్చే టాప్ హీరోలు ఉన్నారిక్కడ. ఇక టాలెంటెడ్ డైరెక్టర్స్ అద్భుతమైన మూవీస్ తీసి తెలుగు ఖ్యాతిని చాటారు. తెలుగు సినిమా అంటేనే దేశంలో ఓ బ్రాండ్.

 


అటువంటి టాలీవుడ్ కి ఏమైంది అన్న మాట ఇపుడు వినిపిస్తోంది. తెలుగు సినిమా మార్కెట్ ని ఎంతో ఎత్తుకు పెంచిన  టాప్ స్టార్స్ అంతా ఇపుడు సమ్మర్ ని వూరికే గాలికి వదిలేశారు. ఇది ఎన్నికల ఏడాది. అయినా మొదటి విడతలో ఎన్నికలు పెట్టి ఈసీ గొప్ప రిలీఫ్ ఇచ్చేసింది. పరీక్షల సీజన్ కూడా అయిపోయింది. ఇపుడు అంతా కూల్ గా ఉన్నారు. ఓ వైపు సమ్మర్ హాలీడేస్ ఇచ్చేశారు. కచ్చితంగా రెండు నెలలకు పైగా సమయం. ఇది సువర్ణ అవకాశం.

 


అయితే టాలీవుడ్  మాత్రం ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతోందంటున్నారు. ఈ సమ్మర్ కి పడాల్సిన సినిమాలు లేవని అంటున్నారు. మహేష్ బాబు మహర్షి మూవీ మే 9న రిలీజ్ డేట్ ఇచ్చారు. అంటే సరిగ్గా నెల రోజులు. ఈ మధ్యలో హాలీడేస్ అంతా వేస్ట్ గా పోతున్నాయి. మజిలీ, చిత్ర లహరి వంటి చిన్న బడ్జెట్ మూవీస్ వచ్చి అలరిస్తున్నాయి. మరికొన్ని బడ్జెట్ మూవీస్ వస్తున్నాయి. అయితే భారీ సినిమాలకు ఇదే అవకాశం. కానీ సమ్మర్ ని వూరికే టాలీవుడ్ వదిలేసింది. మహేష్ మూవీ తప్ప మరొకటి లేకపోవడం దారుణం. వందల కోట్ల మార్కెట్ ఈ విధంగా వేస్ట్ అయిపోతోందని బిజినెస్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

 


మరింత సమాచారం తెలుసుకోండి: