ఎన్నికలు ముగిసి పోవడంతో మరో 40 రోజుల తరువాత వచ్చే ఫలితాలు ఎలా ఉన్నా వారి గెలుపు ఓటమిలకు ప్రధాన కారణాలు ఇవి మాత్రమే అంటూ తిరిగి ఎన్నికల ఫలితాలు తరువాత జనంలోకి వెళ్ళడానికి ప్రధాన రాజకీయ పార్టీల నేతలు అందరూ తమ వ్యూహాలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నారు. చంద్రబాబు ఓడిపోతే ఈవిఎం ఓటింగ్ మిషన్ ల వల్ల తన ఓటమి వచ్చింది అని చెప్పుకోవడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు.

గెలుపు పై విపరీతమైన నమ్మకంతో ఉన్న జగన్ అనుకోకుండా ఓడిపోతే ఇది అంతా చంద్రబాబు అనుసరించిన కుట్ర అనీ జనంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థుతులలో పవన్ పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోతే ప్రజలకు ఏమి చెపుతాడు అన్న విషయమై ఆసక్తికర విశ్లేషణలు వస్తున్నాయి. 

ఎన్నికల తరువాత ఓటింగ్ సరళి గురించి కానీ ఈవీఎం మిషన్ ల వైఫల్యం గురించి కానీ ఒక్క మాట మాట్లాడకుండా పవన్ తన మౌనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే పవన్ పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓడి పోతాడు అంటూ మీడియాలో కథనాలు వస్తున్నా ఆ వార్తలు తనకు ఏమి సంబంధం లేదు అన్నట్లు పవన్ ప్రవర్తిస్తున్నాడు. దీనితో పవన్ పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓటమి ఎదురైతే అతడి పరిస్థితి ఏమిటీ అంటూ కథనాలు రావడమే కాకుండా పవన్ తిరిగి సినిమాలలో రాణించగలడా అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

ప్రస్తుత పరిస్థుతులలో మరో ఐదు సంవత్సరాల తరువాత వచ్చే ఎన్నికల కోసం తిరిగి ‘జనసేన’ ను జనం మధ్య బతికించాలి అంటే కోట్లాది రూపాయలలో ఖర్చు అవుతుంది దీనితో పవన్ ను నమ్మి ‘జనసేన’ కు డబ్బు పెట్టె నాయకులు ఎక్కడ దొరుకుతారు అన్న సందేహాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో పవన్ తాను పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోతే ‘జనం మారరు మారలేరు’ అన్న ఆవేసపూరితమైన మాటలు చెప్పి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయి సినిమాలు చేసుకోవడం ఒకటే మార్గం అంటూ ఒకవేళ పవన్ ఓడిపోతే ఆ పరాభవాన్ని ఎలా తప్పించుకోవాలో సలహా ఇస్తూ ఒక మీడియా సంస్థ ప్రచురించిన విస్లేషణ పై అందరి దృష్టి పడింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: