ప్రస్తుత తరం ప్రేక్షకుల అభిరుచులు మారి పోవడంతో సినిమాలలో ఆరు పాటలపద్ధతిని నెమ్మదిగా తప్పిస్తున్నారు. నేటి తరం ప్రేక్షకులు కధలో వెరైటీ సహజత్వం కోరుకుంటున్న పరిస్థితులలో చాల సినిమాలలో ఐదు పాటలు అంతకంటే తక్కువే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ‘మహర్షి’ సినిమాలో ఎనిమిది పాటలు ఉంటాయి అని వస్తున్న వార్తలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో ఉండే ఆరు పాటలు స్ట్రెయిట్ సాంగ్స్ అయితే రెండు పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాదిరిగా వినిపించే పాటలు అని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన రెండు పాటలు పెద్దగా కనెక్ట్ కాని నేపధ్యంలో ఇంకా ఆరు పాటలు అంటే ‘మహర్షి’ పరిస్థితి ఏమిటి అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. 

ఈమధ్య కాలంలో దేవీశ్రీప్రసాద్ టాప్ హీరోల సినిమాలకు సరైన మ్యూజిక్ ఇవ్వడం లేదు అని కామెంట్స్ వస్తున్న పరిస్థుతులలో ఆ కామెంట్స్ కు అనుగుణంగానే ‘మహర్షి’ మూవీలో ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు ఉన్నాయి. దీనితో ‘మహర్షి’ లో 6 స్ట్రెయిట్ పాటలను పెడితే ట్యూన్స్ బాగుండకపోతే ప్రేక్షకులు తట్టుకోగలరా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

దీనికితోడు ఈసినిమాలోని 6 స్ట్రెయిట్ పాటలకు అరగంట సినిమా వృథా అయిపోతే ఈమూవీ నిడివి మూడు గంటలు దాటి పోయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. దీనితో ఇంత పెద్ద సినిమాగా మారిన ‘మహర్షి’ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తే పరిస్థితి ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈసినిమాకు 140 కోట్ల బిజినెస్ జరిగింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈమూవీ పై టాక్ లో ఏమాత్రం తేడా వచ్చినా తీవ్ర పరిణామాలు ఉంటాయి అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: