‘మజిలీ’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత చైతన్య అమాయకత్వం పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను నాగచైతన్యతో మొట్టమొదటిసారి కలిసి నటించిన ‘ఏం మాయ చేసావె’ షూటింగ్ లో మొట్టమొదటి రోజున చైతన్యను చూడగానే అమాయకుడులా కనిపిస్తున్న ఈ వ్యక్తి తనతో రొమాంటిక్ సీన్స్ లో నటించి మెప్పించగలడా అని అనుమాన పడ్డ విషయాన్ని నవ్వుతూ వివరించింది. 

అయితే అలా అమాయకంగా కనిపించే చైతన్య తనను ప్రేమలో దింపుతాడు అని అప్పట్లో తాను కలలో కూడ అనుకోలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సమంత. దీనికితోడు ఆమూవీ షూటింగ్ సమయంలో తనకు తెలుగు రాకపోవడంతో తెలుగులో ఉన్న ఆ డైలాగ్స్ స్క్రిప్ట్ ను బట్టీ పడుతూ తాను చైతన్య విషయమే పట్టించుకోలేదని అంటూ తన దృష్టిలో ఇప్పటికీ చైతన్య అమాయకుడే అంటూ జోక్ చేసింది. 

ఇదే సందర్భంలో ఈ ఇంటర్వ్యూలో సమంతతో కలిసి పాల్గొన్న చైతన్య మరొక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. మొదట్లో సమంత ఫోటోలను తనకు చూపించి ‘ఏం మాయ చేసావె’ సినిమాలో హీరోయిన్ గా సమంతను ఎంపిక చేసినట్లుగా తనకు చెప్పినప్పుడు ఆఫోటోలను చూసి తాను జెస్ట్ ఓకె అని అనుకున్నాను కానీ ఆమె అంత పాపులర్ హీరోయిన్ అవుతుందని తాను కలలో కూడ ఊహించలేదు అంటూ సమంత పై రివర్స్ పంచ్ వేసాడు. 

‘మజిలీ’ సినిమా హిట్ అయింది కాబట్టి తిరిగి వెంటనే తామిద్దరం కలిసి మరో సినిమా కలిసి చేయాలనే ఆలోచన లేదు అంటూ మళ్ళీ తామిద్దరం కలిసి నటించే సినిమా రావాలి అంటే మరో ‘మాయ’ జరగాలి అంటూ ఇప్పట్లో తామిద్దరం కలిసి నటించే అవకాశాలు లేవు అంటూ చైతన్య లీకులు ఇస్తున్నాడు. విజయాలలో ఉన్నప్పుడు అందరూ పలకరిస్తారనీ పరాజయాలు రాగానే స్నేహితులు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు కూడ దూరం జరిగి పోతారనీ అలాంటి పరిస్థుతులలో ఎవరో ఒకరి ప్రోత్సాహం అవసరం అంటూ చైతన్య తనకు అండ సమంత రూపంలో దొరికింది అంటూ చేసిన కామెంట్స్ ను బట్టి చైతు సమంతతో ఎంత ఎమోషనల్ గా ఎటాచ్ అయి ఉన్నాడో అర్ధం అవుతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: