టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ‘చిరుత’సినిమాతో పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడు. రాంచరణ్ సరసన బాలీవుడ్ మోడల్, నటి  నేహా శర్మ నటించింది.  ఈ సినిమాలో పొగరుబోతు అమ్మాయిగా నేహా శర్మ బాగా నటించింది.  గ్లామర్ ప్రదర్శన విపరీతంగా చేసింది. తెలుగులో నటించింది ఒక్క సినిమానే అయినా ఆ మూవీలో నేహా శర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.  ఆ సినిమా తరువాత ఈ భామ తెలుగులో మరో సినిమా చేయలేదు.  అలా అని బాలీవుడ్ లో కూడా ఎక్కువ సినిమాల్లో నటించలేదు..అరకోర సినిమాల్లో కనిపించింది. 

అయితే నేహా అక్కడ ఘాటు ఫోటోషూట్స్ తో దుమ్మురేపుతోంది. నేహా అందాల ఆరబోత చూస్తే ఇప్పటికీ కన్ను తిప్పుకోరు.  ఇటీవల ప్రముఖ మ్యాగజైన్ మాక్సిమ్ కు ఇచ్చిన ఫోటో షూట్ లో నేహా అందాలు చూస్తే కుర్రకారు పిచ్చెక్కించేలా చేశాయి.  ప్రతిసారి తన హాట్ అందాలలో ఫోటో షూట్స్ తీయించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నేహా శర్మకు పనిగా మారింది. 

ఇన్ని చేసినా నేహా శర్మకు సినిమా అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో దక్కడం లేదు. సోషల్ మీడియాలో నేహా శర్మని ఫాలో అయ్యే కుర్రకారు సంఖ్య భారీగానే ఉంది. పాపం సౌత్ ని వదలిపెట్టి బాలీవుడ్ వెళ్లిన చాలా మంది హీరోయిన్ల లాగే నేహా శర్మకు నిరాశఎదురైంది. ప్రస్తుతం ఇలా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ దర్శక నిర్మాతలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: